Chicken : వావ్.. కోడి కూర ఇన్ని సమస్యలను తగ్గిస్తుందా..!

First Published May 11, 2022, 2:22 PM IST

Chicken : కోడి మాంసం తినడం వల్ల ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు తగ్గడమే కాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 
 

Chicken : కోడి కూరలో విటమిన్  ఇ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ 12, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, పొటాషియం, కొవ్వులు, పిండిపదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. 
 

చికెన్ తో .. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ సూప్, చికెన్ పులుసు వంటి చేసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవి రుచికే కాదు.. మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. ముఖ్యంగా ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలను తగ్గించడానికి చికెన్ ఎంతో సహాయపడుతుంది. 

చికెన్ మన రోగ నిరోధక వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుంది. చెకెన్ లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు చికెన్ లో ఉండే భాస్వరం బోలు ఎముకల వ్యాధిని రాకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే దంత క్షయం సమస్యను కూడా తగ్గిస్తుంది. దంతాలను బలంగా కూడా చేస్తుంది. 
 

మధుమేహులకు చికెన్ ఎంతో మంచిది. రెడ్ మీట్ కు బదులుుగా చికెన్ ను తీసుకుంటే వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. 

చికెన్ లో ఉండే మాంసకృత్తులు ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తాయి. ఎందుకంటే ఇవి కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీ బరువును నియంత్రణలో ఉంటుంది. 
 

అయితే చికెన్ ను ఆయిల్ ను డీప్ ఫ్రై చేసుకుని తింటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా కాకుండా గ్రిల్లింగ్ చేసుకుని తింటే దానిలోని పోషకాలు మీకు అందుతాయి. 

చికెన్ క్యాన్సర్  ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహకరిస్తుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. చికెన్ లో ఉండే పోషకాలు, విటమిన్లు రక్తహీనత సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 

అయితే కోడి మాంసం మంచిదని రెగ్యులర్ గా మాత్రం తినకూడదు. ఎందుకంటే ఇది రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతుంది. దీంతో మీ గుండె ప్రమాదంలో పడుతుంది. చికెన్ ను  వారానికి ఒక సారో లేకపోతే 15 రోజులక ఒకసారో తినాలంతే. 

click me!