Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 5 విషయాలు భార్యతో కూడా చెప్పకూడదు!

Published : Feb 27, 2026, 04:57 PM IST

ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. ఒక మనిషి ఎలా ఆలోచించాలి? ఎలా ప్రవర్తించాలి? ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి అనే అంశాలపై చాణక్యుడు స్పష్టమైన మార్గదర్శకత్వం చేశాడు. చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే ఈ 5 విషయాలు ఎవ్వరికీ చెప్పొద్దు. 

PREV
16
భార్యకు కూడా చెప్పకూడని విషయాలు..

వ్యక్తిగత జీవన విధానంపై లోతైన బోధనలు చేసిన మహా పండితుడు చాణక్యుడు. ఆయన రచించిన చాణక్య నీతి అనేక విషయాలపై స్పష్టమైన సూచనలు చేస్తోంది. చాణక్యుడి ప్రకారం జీవితం కేవలం భావోద్వేగాలపై ఆధారపడకూడదు. వివేకం, జాగ్రత్త, పరిస్థితిపై అవగాహన కూడా అవసరం. ముఖ్యంగా దాంపత్య జీవితంలో పరస్పర విశ్వాసం ఎంత ముఖ్యమో, కొన్ని విషయాల్లో మిత భాషిత్వం కూడా అంతే అవసరం అని ఆయన బోధించాడు. చాణక్యుడి ప్రకారం భార్యకు కూడా చెప్పని కొన్ని విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

26
వ్యక్తిగత బలహీనతలు

చాణక్య నీతి ప్రకారం మనలోని భయాలు, లోపాలు, మానసిక అస్థిరతలు, అపరాధ భావనలు వంటి విషయాలను పూర్తిగా బయటపెట్టకూడదు. భవిష్యత్తులో అవే మనపై ప్రతికూలంగా మారే అవకాశముందని చాణక్యుడు బోధించాడు. దాంపత్యంలో అపార్థాలు, విభేదాలు వచ్చినప్పుడు మన బలహీనతలే మనకు నష్టం కలిగించే అవకాశం ఉందని తన బోధనల్లో పేర్కొన్నాడు.

36
ఆర్థిక రహస్యాలు

సంపాదన, దాచిన డబ్బు, పెట్టుబడుల వ్యూహం వంటి అంశాలు పూర్తిగా బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చాణక్యుడు సూచించాడు. ఆర్థిక వ్యవహారాల్లో గోప్యత కూడా రక్షణగా పనిచేస్తుందని చాణక్యుడి అభిప్రాయం.

46
గత అవమానాలు

గతంలో ఎదురైన అవమానాలు, పరాభవాల గురించి ఎక్కువగా చెప్పడం మన గౌరవాన్ని మనమే తగ్గించుకున్నట్లు అవుతుందని చాణక్యుడు చెప్పాడు. ఎప్పుడైనా మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలని, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే వ్యక్తిత్వం బలహీనమవుతుందని ఆయన తన బోధనల్లో వివరించాడు.

56
భవిష్యత్ వ్యూహాలు

రాజకీయాల్లో అయినా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా ముందుగా ప్రణాళికలు బయటపెడితే అవి విఫలమయ్యే ప్రమాదం ఉంటుందని చాణక్యుడు పేర్కొన్నాడు. “కార్యసిద్ధి వరకు కార్య రహస్యం కాపాడాలి” అనే సూత్రం చాణక్య నీతిలో ముఖ్యమైంది.

66
దానం, మంచి పనుల వివరాలు

ఎవరికైనా దానం చేసినా, లేదా సహాయం చేసినా, ఏదైనా మంచి పని చేసినా దానం గురించి ప్రచారం చేయడం మంచిది కాదని చాణక్యుడి అభిప్రాయం. దానివల్ల చేసిన పని పుణ్యం తగ్గుతుందని చాణక్యుడు తన వివరించాడు. నిశబ్దంగా చేసిన దానం మరింత పుణ్యప్రదమని తన బోధనల్లో పేర్కొన్నాడు.

చాణక్యుడి ప్రకారం.. సందర్భం, సమయం, అవసరాన్ని బట్టి మాటను నియంత్రించుకోవడం జ్ఞానం. గౌరవం, రహస్య పరిరక్షణ, వివేకం అనే మూడు సూత్రాలు పాటిస్తే వ్యక్తిగత జీవితం స్థిరంగా ఉంటుందని చాణక్య నీతి చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories