బయట ఎండలు మండిపోతున్నాయి.ఈ ఎండాకాలంలో వేడి తట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి.మీ ఇంట్లో కూడా అంతేనా? మరి.. రోజులో ఎనిమిది గంటలకు మించి సీలింగ్ ఫ్యాన్ వాడితే ఏమౌతుందో తెలుసా? దీని వల్ల చాలా సమస్యలు వస్తాయని మీకు తెలుసా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
ఈ సీజన్ లో ఫ్యాన్ లేకుండా కేవలం ఐదు నిమిషాలు ఉండటం కూడా కష్టంగానే అనిపిస్తుంది. కానీ, ఫ్యాన్ ఇలా రోజంతా గంటల తరపడి తిరుగుతూ ఉంటే, అది వేడెక్కుతుంది.అలా వేడెక్కినప్పుడు సీలింగ్ ఫ్యాన్ కాయిల్ కాలిపోతుంది. లేదా, ఇతర సమస్యలు కూడా వస్తాయి.
సీలింగ్ ఫ్యాన్ ఎందుకు వేడెక్కుతుంది?: సీలింగ్ ఫ్యాన్ గంటల తరబడి తిరుగుతూ ఉంటే, దానిలోని మోటార్ విద్యుత్తును వేగంగా మారుస్తుంది. దీని ఫలితంగా సీలింగ్ ఫ్యాన్ వేడెక్కుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సీలింగ్ ఫ్యాన్‌ను 6 - 8 గంటలకు కనీసం ఒక్కసారైనా ఆపివేయాలి. ఎటువంటి విరామం లేకుండా సీలింగ్ ఫ్యాన్ నిరంతరం తిరుగుతూ ఉంటే, దాని పనితీరు దెబ్బతింటుంది. ముఖ్యంగా సీలింగ్ ఫ్యాన్ లోపల ఉండే వైరింగ్ దెబ్బతినే అవకాశం ఉంది.
ఓవర్‌హీట్ అవడం వల్ల స్పార్కింగ్ ప్రమాదం:
ఫ్యాన్ మోటార్ వేడెక్కడం కొనసాగితే, అది చివరికి స్పార్కింగ్‌కి దారి తీయవచ్చు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మోటార్ భాగంలో ఏదైనా శబ్ధం వస్తే, వెంటనే ఎలక్ట్రిషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.
వేడి వల్ల ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోవచ్చు:
సాధారణంగా ఒక ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోవడాన్ని చాలా మంది గమనించరు. కానీ ఇది మోటార్‌లో ప్రాబ్లెమ్ మొదలైందని సంకేతం కావచ్చు. మోటార్ వేడి కావడం వల్ల కాయిల్ నెమ్మదిగా పనితీరు కోల్పోతూ ఉంటుంది. ఫ్యాన్ మోటార్ తక్కువ పనితీరు కనబర్చడం వల్ల, అదే స్పీడ్‌కి పని చేయాలంటే ఎక్కువ విద్యుత్తు అవసరమవుతుంది. దీని వల్ల మీ కరెంటు బిల్లు కూడా పెరుగుతుంది.
మరమ్మతులకు ఖర్చు పెరగడం:
ఫ్యాన్‌ను నిరంతరం విరామం లేకుండా ఉపయోగించడం వల్ల అంతర్గత భాగాల దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీని వల్ల కొద్ది నెలల వ్యవధిలోనే రిపేర్ అవసరం ఏర్పడుతుంది. ఇది కొత్త ఫ్యాన్ కొనడానికి దారి తీసే పరిస్థితికి చేరవచ్చు.
గుర్తుంచుకోండి: తప్పనిసరిగా నెలకు ఒకసారైనా సీలింగ్ ఫ్యాన్‌ను శుభ్రం చేయాలి. దీనివల్ల విద్యుత్తును కూడా ఆదా చేయవచ్చు. సీలింగ్ ఫ్యాన్‌లో దుమ్ము ఉంటే, దాని నుండి గాలి సరిగ్గా రాదు.