Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?

Published : Sep 07, 2026, 05:39 PM IST

Moles: కొందరికి ముఖంపై పుట్టుమచ్చలు వస్తాయి. అలాంటప్పుడు కొంతమంది ఇంటి చిట్కాలను పాటిస్తారు. ముఖ్యంగా ఆపిల్ సిడర్ వెనిగర్ తో పుట్టమచ్చలను తొలగించేందుకు ప్రయత్నిస్తారు. అలా చేయడం మంచిదేనా?

PREV
13
పుట్టుమచ్చలను తొలగించేందుకు

ముఖంపై లేదా ఒంటిపై ఉండే పుట్టుమచ్చలను వదిలించుకోవడానికి చాలామంది ఇంటర్నెట్‌లో కనిపించే సులువైన చిట్కాలను గుడ్డిగా నమ్ముతుంటారు. ఇందులో ముఖ్యంగా 'యాపిల్ సైడర్ వెనిగర్' రాస్తే పుట్టుమచ్చలు రాలిపోతాయనే ప్రచారం బాగా సాగుతోంది. వెనిగర్‌లో ఉండే ఎసిటిక్ యాసిడ్ పుట్టుమచ్చ కణాలను కరిగిస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది ఎంతమాత్రం సురక్షితమైన పద్ధతి కాదని, దీనివల్ల పుట్టుమచ్చ పోవడం అటుంచితే కొత్త సమస్యలు వచ్చిపడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

23
మచ్చ పోదు.. గాయాలు మిగులుతాయి!

యాసిడ్ గుణం ఉండే వెనిగర్‌ను చర్మంపై నేరుగా రాసినప్పుడు పుట్టుమచ్చతో పాటు దాని చుట్టూ ఉండే సున్నితమైన చర్మం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల తీవ్రమైన మంట, చర్మం ఎర్రబడటం, పొక్కులు రావడం లేదా రసాయన కాలిన గాయాలు (కెమికల్ బర్న్స్) ఏర్పడే ప్రమాదం ఎక్కువ. గాయం మానిపోయిన తర్వాత కూడా అక్కడ శాశ్వతంగా నల్లటి లేదా తెల్లటి మచ్చలు, గుంటలు పడి అందవిహీనంగా తయారవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, ఇంత బాధ అనుభవించినా ఆ పుట్టుమచ్చ పూర్తిగా తొలగిపోతుందన్న గ్యారెంటీ అస్సలు లేదు.

33
సొంత ప్రయోగాలు వద్దు..

శరీరంపై ఉండే అన్ని పుట్టుమచ్చలూ సాధారణమైనవి కాకపోవచ్చు. కొన్నిసార్లు పుట్టుమచ్చ ఆకారం, పరిమాణం, రంగు మారడం లేదా రక్తం కారడం వంటివి చర్మ క్యాన్సర్‌కు ప్రాథమిక సంకేతాలు కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వెనిగర్‌తో ప్రయోగాలు చేస్తే సమస్య మరింత ముదిరిపోతుంది. అందుకే పుట్టుమచ్చలను తొలగించుకోవాలనుకుంటే చర్మవ్యాధి నిపుణుడిని (Dermatologist) సంప్రదించడమే ఉత్తమం. ఆధునిక వైద్య విధానాల ద్వారా చిన్న శస్త్రచికిత్సతో ఎలాంటి మచ్చలు, ఇన్ఫెక్షన్లు లేకుండా సురక్షితంగా వాటిని తొలగించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories