డయాబెటిస్ ఉన్నవారు బొప్పాయి తినొచ్చా?

First Published Jul 29, 2021, 1:41 PM IST

డయాబెటిక్ డైట్ విషయానికి వస్తే ‘ఏమి తినాలి’, ‘ఏమి తినకూడదు’ అనేది చాలా గందరగోళంగా ఉంటుంది. కొంతమంది నిపుణులు రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను చేర్చాలని సూచిస్తుండగా, మరికొందరు సుక్రోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉండే పండ్లను చేర్చడం మానేయాలని చెబుతారు.

డయాబెటిస్.. అప్పటివరకున్న జీవనశైలిలో అనేక మార్పులు తెస్తుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో అన్నీ అనుమానాలే.. ఏది తినొచ్చు? ఏది తినొద్దు? ఏది ఎంత తినాలి? ఇలా అనేక సందేహాలు..
undefined
రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం కూడా డయాబెటిస్ గా పరిగణిస్తారు. దీనివల్ల శరీరం తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. లేదా ఉత్పత్తైన ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించదు.
undefined
మన శరీరానికి ఇన్సులిన్ హార్మోన్ చాలా అవసరం. ఇది ఆహారం నుండి వచ్చిన గ్లూకోజ్ ను శరీర కణాలు శోషించుకోవడానికి సహాయపడుతుంది. తరువాత ఇది శక్తిగా మారుతుంది. అయితే, డయాబెటిస్‌ వచ్చిన వారిలో ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడంతో రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోవడానికి దారితీస్తుంది.
undefined
అందుకే మనం తీసుకునే ఆహారం మీద కంట్రోల్ అవసరం. మనం తినే ఆహారం నుంచి శక్తిని పొందాలంటే ఇన్సులిన్ హార్మోన్ సమర్థవంతంగా పనిచేయడం చాలా అవసరం. డయాబెటిస్ ఉన్నవారు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి మందులు, నివారణల కోసం ప్రయత్నించడానికి కారణం ఇదే.
undefined
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రక్తంలో చఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రక్తంలో చక్కెరలను నియంత్రించడానికి సులభమైన మార్గం తీసుకునే ఆహారం మీద అవగాహన పెంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. క్కెరలను నియంత్రించడానికి సులభమైన మార్గం తీసుకునే ఆహారం మీద అవగాహన పెంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
undefined
అందుకే డయాబెటిక్ డైట్ విషయానికి వస్తే ‘ఏమి తినాలి’, ‘ఏమి తినకూడదు’ అనేది చాలా గందరగోళంగా ఉంటుంది. కొంతమంది నిపుణులు రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను చేర్చాలని సూచిస్తుండగా, మరికొందరు సుక్రోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉండే పండ్లను చేర్చడం మానేయాలని చెబుతారు.
undefined
అయితే మధుమేహవ్యాధిగ్రస్తులు బొప్పాయి తినొచ్చా? అనే సందేహం మామూలుగానే కలుగుతుంది. ఇక్కడ బొప్పాయి గురించి కొంత తెలుసుకోవాలి.
undefined
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తీపి, ఆరోగ్యకరమైన పండ్లను మితంగా తినవచ్చు. బొప్పాయిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్దకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.
undefined
యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్డిఎ) ప్రకారం, తాజా బొప్పాయిలో 11 గ్రాముల చక్కెర ఉంటుంది. బొప్పాయి గ్లైసెమిక్ ఇండెక్స్ 60 ఉంది. అందుకే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచడానికి దారితీయదు.
undefined
బొప్పాయిలోని మీడియం గ్లైసెమిక్ స్థాయిల కారణంగా డయాబెటిస్‌కు మంచిదని కొందరు నిపుణులు చెబుతుండగా, మరికొందరు బొప్పాయిని మితంగా తీసుకోవడం వల్ల శరీరంపై హైపోగ్లైసీమిక్ ప్రభావం ఉంటుందని, ఇది చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు..
undefined
బొప్పాయిలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. మీ రోజువారీ ఆహారంలో ఒకటి లేదా రెండు రకాల పండ్లను చేర్చడం వల్ల మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.
undefined
కానీ, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లు మీ ఆహారంలో చేర్చడం వల్ల మీ శరీరంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అయితే, మీరు డయాబెటిక్ అయితే మీ డైట్‌లో మార్పులు చేసేముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది.
undefined
click me!