నిమ్మకాయ లోపల రసంతో.. వాటి చుట్టూ సున్నితమైన పొరలు ఉంటాయి. మైక్రోవేవ్‌లో కొద్దిసేపు వేడి తగలగానే ఆ పొరలు మెత్తబడి, కాయ కాస్త మృదువుగా మారుతుంది. మైక్రోవేవ్ చేయడం వల్ల నిమ్మకాయలో కొత్తగా రసం పుట్టదు కానీ, లోపలే చిక్కుకుపోయిన రసమంతా ఎలాంటి కష్టం లేకుండా సులభంగా బయటకు రావడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
నిమ్మకాయ నుంచి ఎక్కువ రసం తీయడం ఎలా?
ముందుగా నిమ్మకాయను శుభ్రంగా కడిగి, ఒక మైక్రోవేవ్-సేఫ్ ప్లేట్‌లో ఉంచండి. దానిని కేవలం 10 నుంచి 15 సెకన్ల పాటు మాత్రమే మైక్రోవేవ్ చేయండి.నిమ్మకాయ పరిమాణం, మైక్రోవేవ్ పవర్‌ను బట్టి సమయం కాస్త మారవచ్చు. బయటకు తీశాక చేతికి పట్టడానికి వీలుగా కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు నిమ్మకాయను కిచెన్ కౌంటర్‌పై పెట్టి, అరచేతితో కాస్త ఒత్తిడిస్తూ గుండ్రంగా దొర్లించండి. ఆ తర్వాత కాయను సగానికి కోసి పిండితే, రసమంతా చుక్క కూడా మిగలకుండా బయటకు వచ్చేస్తుంది. అయితే, నిమ్మకాయను మరీ ఎక్కువ సేపు మైక్రోవేవ్ చేయకూడదు. అది మరీ వేడిగా కాకుండా, కేవలం గోరువెచ్చగా మాత్రమే ఉండాలి.