Buddha Purnima 2022
Buddha Purnima 2022: వైశాఖ పూర్ణిమ రోజునే బుద్ధ భగవానుడు జన్మించాడు. అందుకే మే 16 కు బుద్ద పూర్థిమ అని పేరు వచ్చింది. కాగా బుద్ధ పూర్ణిమ మే 15 న మధ్యాహ్నం 12: 45 గంటలకు మొదలై.. మే 16 ఉదయం 09:43 కి ముగుస్తుంది.
Buddha Purnima 2022
బుద్ధ పూర్ణిమ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజునే బుద్ధుడు బోధి చెట్టు కింద జ్ఞానోదయం పొందాడు.
బుద్ధ భగవానుడి చరిత్ర.. బుద్ద భగవానుడు (సిద్ధార్థ గౌతముడు) శక్య వంశానికి రాజు, రాణి అయిన శుద్ధోధనుడు, మాయ దంపతులకు జన్మించాడు. బుద్ధుడు పుట్టక ముందే అతను గొప్ప పాలకుడు లేదా గ్రీకు సన్యాసి అవుతాడని జోస్యం చెప్పారట. దాంతో కొడుకును కోల్పోతాననే భయంతో రాజు శుద్ధోధనుడు సిద్ధార్థ గౌతముడిని రాజభవనంలోనే ఉంచాడు. సిద్ధార్థ గౌతముడు 29 సంవత్సరాల వయసులో బయటిప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మొదటి సారి రాజభవనం దాటిన గౌతమ బుద్దుడు ఈ మూడు దృశ్యాలు చూశాడు. వృద్ధుడు, ఒక మృతదేహం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి.. ఈ ముగ్గురు బుద్దుడికి కనిపిస్తారు. ఈ మూడు దృశ్యాలు.. జీవితం ఎంత దు:ఖంతో నిండి ఉంటుందో గౌతమ బుద్ధుడికి అర్థమయ్యేలా చేశాయి. ఈ జీవితం కేవలం తాత్కాలిక దశ మాత్రమేనని బుద్దుడికి అర్థమయ్యింది. బాహ్య ప్రపంచాన్ని చూసిన గౌతమ బుద్ధుడు రాచరిక జీవితాన్ని వదిలిపెట్టి అడవులకు ప్రయాణమయ్యాడు. సిద్ధాంతాలను అధ్యయనం చేస్తూ .. యోగ తపస్సులు చేసి ఆరేండ్లు అలాగే గడిపాడు.
buddha-purnima 2022
గౌతమ బుద్ధుడు ఎలా జ్ఞానోదయం పొందాడు.. బోధి వృక్షం కింద బుద్దుడు జ్ఞానోదయం పొందాడు. ఆ తర్వాత ప్రజలకు జ్ఞానోదయ ప్రసంగాలను చేస్తూ 45 ఏంండ్లు ఇలాగే గడిపాడు.ఆ తర్వాత 80 స౦వత్సరాల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లాడు.
బుద్ధ భగవానుడికి సమర్పించే నైవేద్యాలు .. బుద్ధ భగవానుడి విగ్రహాన్ని నీరు, పూల రేకులతో నిండిన గిన్నెలో ప్రతిష్టిస్తారు. బుద్దభగవానుడిని పూజించేటప్పుడు తేనె, కొవ్వొత్తులు, పండ్లు, పువ్వులను సమర్పిస్తారు. ప్రప౦చ౦లోని అనేక ప్రా౦తాల్లో, భక్తులు పక్షులు, జ౦తువులు, కీటకాలను బోనుల ను౦డి విముక్తి కల్పించడం కోసం వాటిని అందులోంచి విడుదల చేస్తారు.
Buddha Purnima 2022
బుద్ధ పూర్ణిమకు ఏదైనా ప్రత్యేకమైన ప్రసాదం ఉందా.. ఖీర్ బుద్ధ పూర్ణిమ సందర్భంగా తయారు చేసి అందించే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రసాదం. ఈ ప్రసాదాన్ని బియ్యం, పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్ తో తయారుచేస్తారు. ఖీర్ ప్రసాదాన్ని మొదట బుద్ధ భగవానుడికి సమర్పిస్తారు. ఆ తరువాత సన్యాసులకు సమర్పిస్తారు. ఆ తరువాత కుటుంబం తీసుకుంటుంది. కొంతమంది ఈ ప్రసాదాన్ని పంపిణీ కూడా చేస్తారు.
బుద్ధ పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత.. బుద్ధ పూర్ణిమను బౌద్ధమతస్థులే కాదు ప్రపంచమంతటా జరుపుకుంటారు. ఈ రోజు శాంతి, అహింస, సామరస్యాన్ని సూచిస్తుంది. ఈ బుద్ధపూర్ణిమ బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుని జయంతిని తెలియజేస్తుంది. జన్మ మరియు పునర్జన్మల చక్రం నుండి విముక్తి పొందిన తత్వవేత్త, ఆధ్యాత్మిక మార్గదర్శి, మత నాయకుడు, ధ్యాని అయిన గౌతమ బుద్దుడికి గౌరవార్థం ఈ రోజును జరుపుకుంటారు. బుద్ధ పూర్ణిమ రోజున భక్తులు బుద్దుడి దేవాలయాలను సందర్శిస్తారు. బోధి వృక్షం అడుగున నీటిని పోస్తారు, పేదలకు సహాయం చేస్తారు. పూజలు తో పాటుగా ధ్యానం కూడా చేస్తారు.