Hunger Control Tips: వీటిని తింటే ఆకలి అదుపులో ఉండటమే కాదు.. బరువు కూడా తగ్గుతారు..

Published : May 15, 2022, 04:00 PM IST

Hunger Control Tips: కొంతమంది బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. కానీ ఆకలి వీరిని ఊరుకోనివ్వదు. దీంతో ఎక్కువగా తింటుంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. అవేంటంటే..   

PREV
17
Hunger Control Tips: వీటిని తింటే ఆకలి అదుపులో ఉండటమే కాదు.. బరువు కూడా తగ్గుతారు..

Hunger Control Tips: ప్రపంచ దేశాలతో పాటుగా భారత దేశంలో కూడా ఊబకాయుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ కాలంలో లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఇంటి నుంచే పనిచేయడం వల్ల కూడా ఊబకాయుల సంఖ్య బాగా పెరిగింది. ఇక సన్నబడేందుకు రెగ్యులర్ గా  జిమ్ములల్లో చెమటలు చిందించే వాళ్లు చాలా మందే ఉన్నారు. 
 

27

అయితే ఈ వ్యాయామాల వల్ల విపరీతంగా ఆకలి అవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఆకలి నియంత్రణలో ఉండటమే కాదు సులభంగా బరువు తగ్గుతారు కూడా. 

37

ఆకలిని నియంత్రించే ఆహారాలు.. క్రమం తప్పకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల తిన్న తర్వాత  ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. అలాగే దీనివల్ల మీ బరువు తగ్గే ప్రాసెస్ సులభతరం అవుతుంది. ఎందుకంటే ఈ ఊబకాయానికి.. తినడం, ద్రవ పదార్థాలను తీసుకోవడంతో ముడి పడి ఉంటుంది కాబట్టి. ఇంతకి ఆకలి తగ్గాలంటే ఏం తినాలో తెలుసుకుందాం పదండి.

47

గుడ్డు.. మీరు రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తింటే మధ్యాహ్నం వరకు ఆకలిగా అనిపించదు. ఎందుకంటే ఇది ఆకలిని పెంచే హార్మోన్లను బలహీనపరుస్తుంది. అంతేకాదు బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. 

57

ఆపిల్.. ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు ఆరోగ్య నిపుణులు. ఈ పండులో కొవ్వును కరిగించే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కడుపు నిండుగా ఉందని.. ఇప్పుడు ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదని మెదడుకు ఒక  సందేశం కూడా చేరుతుంది. 

67

డార్క్ చాక్లెట్.. చాక్లెట్లు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ వీటికి బదులుగా స్వచ్ఛమైన డార్క్ చాక్లెట్లను బేషుగ్గా తినొచ్చు. దీన్ని తినడ వల్ల చాలా సేపటి వరకు ఆకలిగా అనిపించదు. 

77

పెరుగు..  పెరుగులో ఎన్ని ఔషదగుణాలుంటాయో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది ఎన్నో ప్రోటీన్లను, ఖనిజాలను, విటమిన్లను కలిగి ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వేసవిలో దీన్ని తినడం వల్లల పొట్ట చల్లగా ఉంటుంది. పెరుగును తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. 
 

click me!

Recommended Stories