Brain eating amoeba: మెదడును తినేసే అమీబా, ఇది శరీరంలో చేరితే యముడిని పలకరించి వచ్చినట్టే.. అసలు ఏమిటి ఈ వ్యాధి?

Published : Sep 20, 2025, 04:15 PM IST

కేరళలో కంటికి కనిపించని అమీబా వల్ల ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి తెలియకుండానే అమీబా వారి శరీరాల్లో చేరి మెదడును తినేసింది. ఈ భయంకరమైన వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 

PREV
14
బ్యాక్టిరియాల్లాగే అమీబా ఎఫెక్ట్

బ్యాక్టీరియాలు, వైరస్‌లు, ఫంగస్‌ల వల్ల మనిషి తీవ్రమైన అనారోగ్యాల బారిన పడుతుండడం మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు అమీబాలు కూడా ఆ కోవలోకే చేరిపోయాయి. శరీరంలో చేరిన అమీబా మెదడు వరకు చేరి ఆ మెదడును తిని ప్రాణాలు తీసేస్తోంది. కేరళలో ఇప్పటికే ఈ అమీబా వ్యాధి వల్ల వచ్చే వ్యాధి వల్ల 19మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.

24
బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే...

బ్రెయిన్ ఈటింగ్ అమీబా దీనిని నెగ్లేరియా ఫౌలేరీ అని పిలుస్తారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడేలా చేస్తుంది. అది అరుదైన వ్యాధిగా మారిపోతుంది. దీనికి చికిత్స చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మూడు నెలల శిశువు నుంచి వందేళ్ళ అభివృద్ధి వరకు ఎవరి ప్రాణాలనైనా తీయగలదు ఈ అమీబా.

34
ఈ అమీబాలు ఎక్కడ ఉంటాయి?

వెచ్చని మంచినీటిలో ఉండే బ్యాక్టీరియాను తిని బతికే ఈ అమీబా.. ఆ నీటి నుండే మనుషిలోకి సోకుతోంది. ఇది శరీరంలో చేరాక ‘ప్రైమరీ అమీబిక్ మెన్ఎన్సేఫలిటీస్’ వ్యాధి బారిన పడేలా చేస్తుంది. ఈ అమీబా ఏదైనా చెరువులో సరస్సుల్లో మీరు ఈత కొడుతున్నప్పుడు ముక్కు ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

44
తొలిసారి ఎప్పుడు?

కేరళలో తొలిసారి ఈ అమీబా వల్ల మరణాలు 2016 లోనే నమోదు అయ్యాయి. ఏటా ఒకటి రెండు కేసులు కనిపించేవి. కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఈ అమీబా బారిన పడుతున్నట్టు అక్కడ గుర్తించారు. కేవలం మన దేశంలోనే కాదు అమెరికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్లో కూడా ఈ మెదడు తినే అమీబా వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది.

ఈ పని చేయద్దు

చెరువులో బావులు వద్ద ఈత కొట్టడం వల్లే కేరళలో అధికంగా ఈ అమీబా బారిన ఎక్కువ మంది పడుతున్నారు. అయితే సకాలంలో వారు ఆసుపత్రిలో చేరడం వల్ల వారి ప్రాణాలను దక్కించుకోగలుగుతున్నారు. ప్రస్తుతం కేరళలో 39 కేసులు నమోదయ్యాయి. అందులో 19 మంది మరణించినట్టు గుర్తించారు. ఈ అమీబాను సకాలంలో గుర్తిస్తే మనిషి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories