Blood Group: మీకు కోపం ఎక్కువా? అయితే మీ బ్లడ్ గ్రూప్ అదే

Published : Mar 01, 2025, 07:00 AM IST

Blood Group: మీ బ్లడ్ గ్రూప్ మీ లక్షణాలను చెబుతుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కొంతమందిపై చేసిన ప్రయోగాల ఆధారంగా ఈ విషయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ డేటా ప్రకారం ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
Blood Group: మీకు కోపం ఎక్కువా? అయితే మీ బ్లడ్ గ్రూప్ అదే

సాధారణంగా ముఖ్యమైన బ్లడ్ గ్రూప్స్ నాలుగు. A, B, AB, O. వీటిల్లో మళ్లీ పాజిటివ్, నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి. A+, B+, AB+, O+, A-, B-, AB-, O-. వీటిల్లో నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారికి బ్లడ్ అవసరమైతే దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని అరుదైన బ్లడ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. బాంబే బ్లడ్ గ్రూప్ మొదలైనవి. ఇవి కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే ఉంటాయి.  
 

25

బ్లడ్ గ్రూప్‌ను బట్టి మనుషుల వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోవచ్చని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా జపాన్ వంటి దేశాల్లో ఈ ప్రిడిక్షన్ చాలా ఫేమస్. ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎలాంటి లక్షణాలు, వ్యక్తిత్వం ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. O బ్లడ్ గ్రూప్
వీళ్లు స్వతంత్ర భావాలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఇతరులు చెప్పిన విషయాలకు సరే అనకుండా వారికంటూ ఓ ప్రత్యేక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. నాయ‌కత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అనుకున్న పని ఏదైనా పూర్తి చేసే దాకా వదలరు. అంతేకాకుండా చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. అందరితోనూ సరదాగా ఉంటారు. ఫ్లెండ్లీగా, ఆత్మవిశ్వాసంగా ఉంటారు. కష్టలను ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. లీడర్‌షిప్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అంచనా వేయలేం. అప్పటి వరకు కూల్ గా ఉన్న వారు ఒక్కసారిగా ఓవర్ రియాక్ట్ అయిపోతారు.

35

2. A బ్లడ్ గ్రూప్
ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు క్రమశిక్షణతో జీవిస్తారు. బంధాల పట్ల బాధ్యతగా ఉంటారు. ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నయినా పూర్తిగా తెలుసుకున్నాకే ఓ నిర్ణయానికి వస్తారు. ఈ A గ్రూప్ వ్యక్తుల ఏ పనినైనా బాధ్యతగా భావించి చేస్తారు. వీరు చాలా సున్నితంగా ఉంటారు.  భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటారు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలానే ఉంటారు. ఇతరులను గుడ్డిగా నమ్మేయరు. ఎదుటి వారి ప్రవర్తనను బట్టి వారిపై ఓ అభిప్రాయానికి వస్తారు. వీళ్లలో కాస్త మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ టెన్షన్ పడుతుంటారు.

45

3. B బ్లడ్ గ్రూప్

వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఊహలకే ప్రాధాన్యం ఇస్తారు. ఇమాజినరీ థింకింగ్ ని ఇష్టపడతారు. వీళ్లు ఏ విషయంలోనైనా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ B గ్రూప్ వ్యక్తులు స్వేచ్ఛాస్వభావాన్ని కలిగి ఉంటారు. కొంత వెరైటీగా కూడా ఉంటారు. వీరు కొత్త ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీళ్లకి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే రియాక్ట్ అయిపోతారు. తప్పు చేస్తే ఈజీగా క్షమించరు.
 

55

4. AB బ్లడ్ గ్రూప్

AB బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు తెలివితేటలు ఎక్కువ.  చాలా కూల్ గా, కంట్రోల్ గా ఉంటారు. మల్టీ టాస్కింగ్ చేయగలరు. సాఫ్ట్ మెంటాలిటీ కలిగి ఉంటారు. అయితేనే అందరితోనూ కలసి మెలిసి జీవించడానికి ఇష్టపడతారు. AB గ్రూప్ వ్యక్తులు రెండు రకాల వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వాళ్లు కావాలనుకుంటే ఎంత డేరింగ్ నిర్ణయమైనా తీసుకుంటారు. అవసరం లేదనుకుంటే ఏం జరిగినా పట్టించుకోరు. అయితే వీళ్లలో కాస్త మతిమరుపు కూడా ఉంటుంది. బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వరు.

ఇది కూడా చదవండి: టవల్స్‌ని నెలల తరబడి వాడుతున్నారా? వాటిని మార్చకపోతే ఎన్ని చర్మ సమస్యలో తెలుసా?

click me!

Recommended Stories