Benefits and Harm of Eating Bitter Gourd: కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీనిని వేసవిలో తినకూడదని చాలా మంది అంటూ ఉంటారు. ఒక వేళ తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Benefits and Harm of Eating Bitter Gourd: మార్చి పోయి జూన్ నెల వచ్చినా.. ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. మండుతున్న ఎండలకు, తీవ్రమైన ఉక్కపోతలకు జనాలు అల్లాడుతున్నారు. వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి ఎన్నో రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. కాగా ఇదే సీజన్ లో కాకరకాయలు కూడా బాగా పండుతాయి. అయితే వీటిని వేసవిలో తినొచ్చా? లేదా ? ఒక వేళ తింటే ఏమౌతుందన్న అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఈ వేసవిలో కాకరకాయలను తినాలా? వద్దా? దీనివల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలేంటో వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం పదండి.
211
వేసవిలో కాకరకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
311
వేసవిలో కాకరకాయను (Bitter Gourd) తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలున్నవారికి ఇది చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది.
411
ఈ ఎండాకాలంలో కాకరకాయను తినడం వల్ల డయబెటీస్ (Diabetes) సమస్యను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అందుకే వీరు తరచుగా కాకరకాయలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
511
bitter gourd
కాకరకాయలో యాంటీ ఇన్ప్లమేటరీ (Anti-inflammatory) లక్షణాలు ఉంటాయి. ఇవి శరీర వాపును తగ్గిస్తుంది. అలాగే క్రమం తప్పకుండా కాకరకాయను తినడం వల్ల ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
611
హేమోరాయిడ్స్ (Hemorrhoids), మలబద్దకం (Constipation) వంటి సమస్యలను తగ్గించడానికి కాకరకాయలు దివ్య ఔషదంలా పనిచేస్తాయి.
711
వేసవిలో కాకరకాయను తినడం వల్ల కలిగే నష్టాలు.. ఈ వేసవిలో కాకరకాయను తినే మధుమేహులు ఒకసారి డాక్టర్ సలహాలను తీసుకోవడం మంచిది.
811
పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ సీజన్ లో కాకరకాయను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు కూడా కాకరకాయను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వీరు కాకరకాయలను తింటే హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.
911
ఎక్కువ సార్లు కాకరకాయను తినడం వల్ల కడుపు తిమ్మిరి (Stomach cramps), గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
1011
కాకరకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది.. కాకరకాయలో చలువ చేసే గుణం ఉంటుంది. అంటే దీన్ని తిన్నవారి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే చాలా మంది వేసవిలో కాకరకాయలను ఎక్కువగా తింటూ ఉంటారు.
1111
కాకరకాయలో మన శరీరాన్ని ఫిట్ గా ఉంచేందుకు సహాయపడే అనేక పోషకాలు ఉంటాయి. కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లుు, పాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.