మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. తాను తన భార్యతో విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అంతకముందు... 2019లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా తన భార్యతో విడాకులు తీసుకున్నారు. టెస్లా సంస్థ చీఫ్ ఎలన్ మస్క్ కూడా గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్నాడు. ఈ సెలబ్రెటీలంతా.. తమ భార్యల నుంచి విడాకులు తీసుకోవడానికి పెద్ద మొత్తంలోనే భరణం చెల్లించాల్సి వచ్చింది.
అందుకే వీరి విడాకులు అత్యంత కాస్ట్లీ అని అందరూ చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఈ సెలబ్రెటీలు.. తమ భార్యలకు విడాకులు ఇచ్చినందుకు ఎవరెవరు ఎంతెంత చెల్లించారో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్.. తన భార్యలకు రెండుసార్లు విడాకులు ఇచ్చాడు. ఎలన్ మస్క్ మొదటి భార్య జస్టిన్ నుంచి 2008లో విడాకులు తీసుకున్నారు. జస్టిన్‌కు చెల్లించే మొత్తానికి సంబంధించి, పిల్లల బాధ్యతలకు సంబంధించి కోర్టు వెలుపల వారిరువురు ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత బ్రిటిష్ నటి టలులా రిలేను మస్క్ వివాహం చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే ఆమె నుంచి కూడా విడాకులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు దాదాపు 20 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు వార్తలు వచ్చాయి.
ఇక జెఫ్ బెజోస్ తన భార్యకు 2019లో విడాకులు ఇచ్చారు. బెజోస్‌తో విడాలకు కారణంగా మెకెంజీకి ఏకంగా దాదాపు రూ.2.62 లక్షల కోట్ల (38 బిలియన్ డాలర్లు) డబ్బు ఇవ్వడం గమనార్హం.విడాకుల తర్వాత స్వతహాగా రచయిత అయిన మెకెంజీ ప్రపంచంలోనే నాలుగో అత్యంత ధనిక మహిళగా మారతారు. అయితే ఈ సంపదలో సగం వారెన్ బఫెట్, బిల్‌గేట్స్ స్థాపించిన ది గివింగ్ ప్లెడ్జ్ అనే ధార్మిక సంస్థకే అందిస్తానని గతంలోనే ఆమె చెప్పారు.
బిల్ గేట్స్.. తమ 27ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్, మెలిందా సోమవారం ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవటం ఒక్కసారిగా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే వీరి విడాకులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా మారనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెలిందాకు బిల్ ఇచ్చే భరణం విలువ విలువ దాదాపు 127 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది.
రూపర్ట్ మర్డాక్- అన్నా మరియా మన్ఆస్ట్రేలియాకు చెందిన మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డాక్.. స్కాటిష్ జర్నలిస్ట్, రచయిత్రి అన్నా మరియా మన్ల విడాకులు కూడా చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా నిలిచిపోయాయి. 1999లో వీరు విడిపోయారు. ఆ సమయంలో అన్నా మరియా మన్ 1.7 బిలియన్ డాలర్లు ఆస్తితో పాటు 110 మిలియన్ డాలర్లను నగదు రూపంలో పొందారు.
టైగర్ వుడ్స్-ఎలిన్ నోర్డెగ్రెన్ప్రముఖ గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్, ఎలిన్ నోర్డెగ్రెన్.. 2004లో విహహం చేసుకున్నారు. ఆరేళ్లకే (2010) విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల విలువ 710 మిలియ్ డాలర్లుగా అంచనా. వీరికి ఇద్దరు పిల్లలు.
మైఖేల్ జోర్డాన్, జువానిటా వనోయ్..బాస్కెట్ బాల్ ప్లేయర్ మైకెల్ జోర్డాన్, జువానిటా వనోయ్ విడాకులు 2006లో ఓ సంచలనంగా మారాయి. వీరి విడాకుల విలువ 168 మిలియన్ డాలర్లు. వీరు మొదట 2002లో విడాకుల కోసం ప్రయత్నించగా.. ఇరువురి మధ్య రాజీ కుదిరి మళ్లీ ఒక్కటయ్యారు. చివరకు 2006లో విడిపోయారు.