Toothpaste Uses: బ్రష్ చేయడానికి మాత్రమే కాదు..టూత్ పేస్ట్ ఎన్ని శుభ్రం చేయచ్చో తెలుసా?

Published : Jun 19, 2026, 02:43 PM IST

 Toothpaste Uses: ప్రతిరోజూ మనమందరం టూత్ పేస్టుతో బ్రష్ చేస్తూ ఉంటాం. కానీ,కేవలం పళ్లు తోమడానికి మాత్రమే కాకుండా.. ఇంట్లో ఎన్ని రకాలుగా ఉపయోగించచ్చో తెలుసా? చాలా మందికి తెలియని సీక్రెట్ ఇది. 

PREV
13
టూత్ పేస్టు ఉపయోగాలు....

ప్రతి ఒక్కరి ఇంట్లో రకరకాల టూత్ పేస్టులు ఉంటాయి. మనిషికి ఒక రకం టూత్ పేస్టును వాడే వాళ్లు ఉంటారు. ఎన్ని వాడినా అందరూ కేవలం పళ్లు తోమడానికే వాడుతూ ఉంటారు.కానీ.. మన ఇంట్లో చాలా రకాల వస్తువులను శుభ్రం చేయడానికి వాడొచ్చని మీకు తెలుసా? కేవలం కొంచెం టూత్ పేస్టు వాడి.. ఇంట్లో వస్తువులను ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...

నిజానికి ఇంట్లో చాలా రకాల వస్తువులను కొత్త వాటిలా శుభ్రం చేయడానికి మార్కెట్లో చాలా కెమికల్స్ దొరుకుతాయి.కానీ, వాటి వల్ల వస్తువులు డ్యామేజ్ అవ్వడం.. చేతులు పాడవ్వడం లాంటివి జరుగుతాయి. అదే.. టూత్ పేస్టుతో అయితే అలాంటి సమస్య ఉండదు. పైగా.. నిమిషాల్లో కొత్త వాటిలా మెరిపించొచ్చు.

23
1. క్రేయాన్, పెన్సిల్ మరకలు తొలగించడం..

ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే చాలు.. గోడలపై పెన్సిల్స్, క్రేయాన్స్ తో గీతలు అన్నీ గీసేస్తూ ఉంటారు. వాటిని వదిలించడం అంత ఈజీ కాదు. చేతులు నొప్పి పుట్టి పుట్టేస్తూ ఉంటాయి. అలాంటి మొండి మరకలను టూత్ పేస్టు వాడి చాలా ఈజీగా వదిలించొచ్చు. దీని కోసం పెన్సిల్, క్రేయాన్ మరకలపై టూత్ పేస్టు రాసి.. కాసేపు సున్నితంగా రుద్ది తర్వాత ఏదైనా క్లాత్ తో శుభ్రం చేస్తే సరిపోతుంది. మరకలు చాలా వరకు కనిపించకుండాపోతాయి.

2.వెండి వస్తువులను మెరిపించడానికి..

ప్రతి ఒక్కరి ఇంట్లో వెండి వస్తువులు ఉంటూనే ఉంటాయి. అవి రెగ్యులర్ గా వాడటం వల్ల నల్లగా మారతాయి. వాటి నలుపు పోగొట్టి.. మళ్లీ కొత్తదానిలా మెరిపించడానికి టూత్ పేస్టు వాడితే సరిపోతుంది. వెండి వస్తువులపై టూత్ పేస్టు రాసి.. కాసేపటి తర్వాత బ్రష్ తో రుద్దితే కొత్తవాటిలా కనిపిస్తాయి.వెండి పట్టీలను కూడా కొత్త వాటిలా మెరిపిస్తాయి.

3.పాత షూస్ మురికి వదిలించేలా..

మనం రోజూ రెగ్యులర్ గా షూ వాడటం వల్ల అడుగుభాగం నల్లగా మారుతుంది. ఆ మురికి అంత తొందరగా వదలదు. అయితే.. మీరు టూత్ పేస్టుని వాడి.. ఆ నలుపును చాలా ఈజీగా వదిలించొచ్చు.

33
4. ఉల్లి, వెల్లుల్లి వాసన తొలగించడానికి..

మనం ఉల్లిపాయ, వెల్లుల్లి కట్ చేసినప్పుడు చేతుల నుంచి వాసన వస్తుంది. ఆ వాసన పోగొట్టడానికి చాలా తిప్పలు పడుతూ ఉంటారు.ఆ వాసనను కేవలం టూత్ పేస్టు వాడితే సరిపోతుంది.

మీ మొబైల్ స్క్రీన్‌పై తేలికపాటి గీతలను తగ్గించండి:

మీ మొబైల్ స్క్రీన్‌పై గీతలను తొలగించడంలో టూత్‌పేస్ట్ కూడా ఉపయోగపడుతుంది. కొంతమంది స్క్రీన్‌పై చాలా తేలికపాటి గీతలను తగ్గించడానికి టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తారు. అయితే, ఈ పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఫోన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

బాత్రూమ్ ట్యాప్ లను శుభ్రం చేయడానికి..

బాత్రూం లేదా వంటగదిలోని కుళాయిలకు టూత్‌పేస్ట్ అప్లై చేయడం ద్వారా మీరు తెల్లటి మరకలను తొలగించవచ్చు. కొంత సమయం తర్వాత, ఆ ఫిట్టింగ్‌ను శుభ్రమైన గుడ్డతో తుడవడం వల్ల మరకలు తొలగిపోయి, తిరిగి మెరుపు వస్తుంది.

దుస్తులపై మరకలు తొలగించడానికి..

తేలికపాటి మరకలపై టూత్‌పేస్ట్‌ను పూసి రుద్దడం సహాయపడుతుంది. అయితే, ముందుగా బట్టపై చిన్న భాగంలో పరీక్షించడం ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories