IRCTC Kerala Tour : తెలుగోళ్ళ కోసమే ఐఆర్సిటిసి బడ్జెట్ టూర్ ప్లాన్.. హైదరాబాద్ నుండి కేరళకు 6 రోజుల సూపర్ ప్యాకేజీ

Published : Jun 19, 2026, 12:51 PM IST

IRCTC Hyderabad to Kerala Tour : కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఆర్సిటిసి కేవలం తెలుగు ప్రజల కోసమే ప్రత్యేకంగా కేరళ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ బడ్జెట్ ప్రెండ్లీ సూపర్ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
15
హైదరాబాద్ టు కేరళ టూర్

Kerala Tour : పచ్చని ప్రకృతి, అందమైన బీచ్ లు, బ్యాక్ వాటర్ మధ్యలో నివాసాలు... ఇలా కేరళ అందాలు వర్ణించడానికి కూడా వీలులేకుండా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కేరళ భూలోక స్వర్గంలా ఉంటుంది... అందుకే దీన్ని 'గాడ్స్ ఓన్ కంట్రీ' అంటారు.

కేరళ సహజ అందాలను చూసి పర్యాటకులు ముగ్దులవుతుంటారు. బ్యాక్ వాటర్స్ లో పడవప్రయాణం, చల్లని హిల్ స్టేషన్స్ లో ట్రెక్కింగ్, సైట్ సీయింగ్, అందమైన బీచుల్లో సేదతీరడం... ఇలా కేరళ పర్యటన అద్భుతంగా ఉంటుంది. మీరుకూడా కేరళ అందాలను ఆస్వాదించాలని అనుకుంటున్నారా..? అయితే IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్) బడ్జెట్ ధరలో ప్రకటించిన 'కేరళ హిల్స్ & వాటర్స్' టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి.

25
ఆరురోజుల కేరళ హిల్స్ & వాటర్స్ టూర్..

తెలుగువారి కోసమే ప్రత్యేకంగా కేరళ టూర్ ప్యాకేజీని రూపొందించింది IRCTC.హైదరాబాద్ నుండి ప్రయాణం ప్రారంభం అవుతుంది.. రైలు, రోడ్డు మార్గాల్లో టూర్ సాగుతుంది. కేరళలోకి అలెప్పి, మున్నార్ ప్రాంతాల సందర్శన ఉంటుంది... మొత్తం 5 రాత్రులు/6 రోజులు ప్రయాణం సాగుతుంది. రైలులో స్లీపర్ క్లాస్ లేదా 3AC ప్రయాణం ఉంటుంది.. అలాగే రోడ్డు ప్రయాణంలో ఏసి వాహనం (షేరింగ్) ఉంటుంది. ప్రస్తుతం పూర్తిగా ఎండలులేవు, అలాగని జోరువానలు లేవు... కాబట్టి కేరళ పర్యటనకు ఇదే మంచి సమయం. ఇందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజ్ ధరలు తక్కువగానే ఉన్నాయి.

35
IRCTC కేరళ టూర్ ప్యాకేజీ ధరలివే...

ఐఆర్సిటిసి కేరళ టూర్ కోసం రెండు రకాల ప్యాకేజీలు సిద్దంచేసింది. ఏప్రిల్ నుండి జూన్ వరకు ప్యాకేజీ ధరలు తక్కువగా ఉంటాయి... జూన్ తర్వాత కాస్త పెరుగుతాయి.

ఏప్రిల్ నుండి జూన్ వరకు కేరళ ప్యాకేజీ ధరలు..

కంపర్ట్ (3AC)

సింగిల్ షేరింగ్ : రూ.32240

ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.18970

ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.16440

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) విత్ బెడ్ తో : రూ.10550

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) బెడ్ లేకుండా : రూ.8150

స్టాండర్డ్ (SL) ప్యాకేజీ

సింగిల్ షేరింగ్ : రూ.32730

ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.17720

ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.15060

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) విత్ బెడ్ తో : రూ.9270

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) బెడ్ లేకుండా : రూ.6560

జూలై నుండి కేరళ ప్యాకేజీ ధరలు..

కంపర్ట్ (3AC)

సింగిల్ షేరింగ్ : రూ.32400

ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.18990

ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.16750

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) విత్ బెడ్ తో : రూ.8840

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) బెడ్ లేకుండా : రూ.8570

స్టాండర్డ్ (SL) ప్యాకేజీ

సింగిల్ షేరింగ్ : రూ.29580

ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.16170

ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.13940

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) విత్ బెడ్ తో : రూ.6420

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) బెడ్ లేకుండా : రూ.5750

45
హైదరాబాద్ టు కేరళ టూర్ సాగుతుందిలా..

హైదరాబాద్-అలెప్పి-మున్నార్-హైదరాబాద్ (05 రాత్రులు/06 రోజులు)

Day 1 (మంగళవారం) 

హైదరాబాద్ నుండి కేరళ టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శబరి ఎక్స్ ప్రెస్ లో రాత్రంతా జర్నీచేయాల్సి ఉంటుంది.

Day 2 (బుధవారం) 

 ఉదయం అలువ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడినుండి మున్నార్ 110 కిలోమీటర్లు ఉంటుంది... రోడ్డుమార్గంలో కేరళ అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం ఉంటుంది. మున్నార్ చేరుకుని హోటల్లో ప్రెష్ అప్ అయ్యాక సాయంత్రం పట్టణ సందర్శన ఉంటుంది. రాత్రి మున్నార్ హోటల్లోనే బస.

Day 3 (గురువారం) 

మూడోరోజు ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్ విజిట్ ఉంటుంది. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ & ఎకో పాయింట్ సందర్శన ఉంటుంది. రాత్రికి మున్నార్ లోనే ఉంటారు.

Day 4 (శుక్రవారం) 

మున్నార్ నుండి అలెప్పికి రోడ్డు మార్గంలో 179 కి.మీ ప్రయాణం ఉంటుంది. ప్రయాణం అనంతరం అలెప్పి హోటల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇష్టమైతే బ్యాక్ వాటర్ లో ఎంజాయ్ చేయవచ్చు. రాత్రి అలెప్పిలోనే బస.

Day 5 (శనివారం) 

అలెప్పి నుండి 60 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేసి ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడినుండి శబరి ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ కు తిరుగుపయనం ఉంటుంది...

Day 6 (ఆదివారం)

రాత్రంతా ప్రయాణం తర్వాత ఆరోరోజు (ఆదివారం) ఉదయం సికింద్రాబాద్ కు చేరుకుంటారు. దీంతో ఐఆర్సిటిసి కేరళ హిల్స్ & వాటర్ ట్రిప్ పూర్తవుతుంది.

55
ఐఆర్సిటిసి ప్యాకేజీలో ఏ సదుపాయాలుంటాయి, ఏవి ఉండవు?

ఐఆర్సిటిసి ప్యాకేజీలో కల్పించే సదుపాయాలు..

  • స్టాండర్డ్ స్లీపర్ లేదా 3AC కంపర్ట్ టికెట్లు
  • రోడ్డు ప్రయాణంలో ఏసి వెహికిల్స్ (షేరింగ్)
  • 3 రాత్రులు వసతి, బ్రేక్ ఫాస్ట్
  • ట్రావెల్ ఇన్సూరెన్స్
  • సైట్ సీయింగ్ సదుపాయం
  • వెహికిల్ టోల్, పార్కింగ్

ఐఆర్సిటిసి ప్యాకేజీలో లేని సదుపాయాలు.

  • మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ తో పాటు అహార పదార్థాలు ఉండవు. కేవలం బ్రేక్ ఫాస్ట్ అందిస్తారు. రైలులో కూడా ఫుడ్ ఎవరికి వారు సమకూర్చుకోవాలి... ప్యాకేజీలో అందించరు.
  • పర్యాటక ప్రాంతాల్లో టికెట్స్ ఖర్చులు యాత్రికులే భరించాలి.
  • బోటింగ్, ఇతర వాటర్ గేమ్స్, హార్స్ రైడింగ్ వంటివాటి ఖర్చులు పర్యాటకులవే
  • టూర్ గైడ్ కావాలంటే సొంత ఖర్చులతో ఏర్పాటుచేసుకోవాలి

ఐఆర్సిటిసి కేరళ హిల్స్ & వాటర్ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం కాంటాక్ట్ చేయండి.

ఐఆర్సిటిసి - సౌత్ సెంట్రల్ జోన్,

9-1-129/1/302,3rd ప్లోర్, ఆక్స్ ఫార్డ్ ప్లాజా

S.D రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.

మొబైల్ నంబర్ : 8287932229/ 8287932228/ 9701360701

Read more Photos on
click me!

Recommended Stories