Mushrooms: మష్రూమ్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి చాలు!

Published : Sep 25, 2026, 10:15 AM IST

Mushrooms: మష్రూమ్స్ (పుట్టగొడుగులు ) రుచితో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. కానీ వీటిని సరిగ్గా నిల్వచేయకపోతే మెత్తబడటం, రంగు మారడం లేదా పాడవడం జరుగుతుంది. మరి మష్రూమ్స్‌ను ఎక్కువ రోజులు తాజాగా, రుచిగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

PREV
16
మష్రూమ్స్ నిల్వ చేసే టిప్స్

మష్రూమ్స్‌తో ఎన్నో రకాల రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అయితే వీటిని సరిగ్గా నిల్వచేయకపోతే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కాస్త తేమ తగిలినా అవి జిగురుగా మారి, నల్లగా తయారవుతాయి. చాలాసార్లు ఇవి కుళ్లిపోయి వృథా అవుతుంటాయి. మరి నెక్ట్స్ టైం అలా కావద్దొంటే, పుట్టగొడుగులను ఎలా నిల్వ చేయాలో ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం.

26
ప్లాస్టిక్ కవర్లలో వద్దు

సాధారణంగా చాలామంది మార్కెట్ నుంచి మష్రూమ్స్ కొనుగోలు చేసి తెచ్చిన వెంటనే ప్లాస్టిక్ కవర్లలో లేదా గాలి చొరబడని పాలిథిన్ బ్యాగుల్లో పెడుతుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. ప్లాస్టిక్ కవర్ లోపల తేమ పేరుకుపోతుంది. దీనివల్ల మష్రూమ్స్ చాలా త్వరగా కుళ్లిపోతాయి.

36
బ్రౌన్ పేపర్ బ్యాగ్

మష్రూమ్స్ నిల్వ చేయడానికి బ్రౌన్ పేపర్ బ్యాగ్ బెస్ట్ ఆప్షన్. మీరు మార్కెట్ నుంచి తెచ్చిన మష్రూమ్స్‌ను కడగకుండా నేరుగా పేపర్ బ్యాగ్‌లో పెట్టాలి. ఈ పేపర్ బ్యాగ్ అదనపు తేమను పీల్చుకుంటుంది. ఇది మష్రూమ్స్ ఎక్కువ కాలం పాడవకుండా కాపాడుతుంది.

46
మష్రూమ్స్ ని ముందే క్లీన్ చేయొద్దు

మష్రూమ్స్ స్పాంజ్ లాగా నీటిని త్వరగా పీల్చుకుంటాయి. మీరు వంట చేసే ముందు మాత్రమే వీటిని కడగాలి. లేదా తడి బట్టతో తుడవాలి. ఒకవేళ వీటిని ముందే కడిగి ఫ్రిజ్‌లో పెడితే, ఒకటి రెండు రోజుల్లోనే పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

56
గాలి చొరబడని డబ్బా

మీ దగ్గర పేపర్ బ్యాగ్ లేకపోతే, ప్లాస్టిక్ లేదా గాజు డబ్బాను ఎంచుకోవచ్చు . డబ్బా అడుగున, పైన పేపర్ టవల్ లేదా టిష్యూ పేపర్ వేయాలి. మధ్యలో మష్రూమ్స్ పెట్టి మూతను కాస్త వదులుగా పెట్టాలి. అయితే ప్రతిరోజూ ఈ టిష్యూ పేపర్‌ను మార్చడం మర్చిపోవద్దు.

66
ఫ్రీజర్‌లో నిల్వ చేయడం

మీరు మష్రూమ్స్‌ను వారాల పాటు ఫ్రెష్‌గా ఉంచాలనుకుంటే, కొద్దిగా వెన్న లేదా నూనెలో 3-4 నిమిషాలు వేయించాలి. చల్లారాక జిప్‌లాక్ కవర్‌లో పెట్టి ఫ్రీజ్ చేయాలి. లేదా మరుగుతున్న నీటిలో 2-3 నిమిషాలు ఉడికించి, వెంటనే ఐస్ వాటర్‌లో వేయాలి. ఆ తర్వాత ఆరబెట్టి ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories