Hair Care: జుట్టుకు నూనె ఎప్పుడు రాయాలి? ఉదయమా? రాత్రా? ఏది మంచిది..?

Published : Sep 21, 2026, 01:38 PM IST

Hair Care: జుట్టు బాగా పెరగాలంటే.. రెగ్యులర్ గా నూనె రాయడం చాలా ముఖ్యం. కానీ, ఈ నూనెను ఉదయం రాయడం మంచిదా? లేక రాత్రి పడుకునే ముందు జుట్టు రాయడం మంచిదా? నిపుణులు ఏమంటున్నారు?

PREV
13
Hair Care

హెయిర్ కేర్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది కొబ్బరి నూనె. మన అమ్మమ్మల కాలం నాటి నుంచి కొబ్బరి నూనె వాడుతూనే ఉన్నారు. కొబ్బరి నూనె హెయిర్ గ్రోత్ కి బాగానే ఉపయోగపడుతుంది. కానీ, దానిని ఎప్పుడు రాయాలి అనే విషయంలోనే చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. కొందరు రాత్రిపూట నూనె రాసుకోవాలని అంటుంటే, మరికొందరు తలస్నానానికి ముందు రాయాలని నమ్ముతున్నారు. ఇంకొందరు ఉదయాన్నే నూనె రాసుకోవడం మంచిదని భావిస్తారు. నూనె ఎక్కువ సేపు తలకు ఉంటే మంచిదని నమ్ముతారు. అది నిజమేనా? లేక.. కేవలం తలస్నానం చేయడానికి ముందు రాసుకుంటే సరిపోతుందా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం....

23
నూనె ఎప్పుడు రాసుకోవాలి?

జుట్టుకు నూనె రాసుకోవాలి అని మీరు అనుకుంటే... తలస్నానం చేయడానికి దాదాపు 30 నిమిషాల నుండి కొన్ని గంటల ముందే రాసుకోవడం ఉత్తమం. ఇది తలను రాత్రంతా జిడ్డుగా మార్చకుండా, జుట్టుపై నూనె పనిచేయడానికి తగిన సమయాన్ని ఇస్తుంది. అంతకంటే ముఖ్యంగా, తలస్నానానికి ముందు నూనె రాసుకోవడం వల్ల స్నానం చేసే సమయంలో జుట్టు ఒత్తిడికి గురికాకుండా కాపాడుకోవచ్చు. కొబ్బరి నూనెను తలస్నానానికి ముందు రాసుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది. అయితే, కొబ్బరి నూనె అద్భుతాలు చేసి జుట్టును పెంచేయదు. కానీ, జుట్టు డ్యామేజ్ తగ్గిస్తుంది.

33
ఉదయం పూట vs రాత్రి పూట: ఏది బెటర్?

మీరు పగటిపూట తలస్నానం చేసే అలవాటు ఉన్నవారైతే, ఉదయాన్నే నూనె రాసుకొని, 30 నిమిషాల నుండి కొన్ని గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. లేదంటే.. రాత్రిపూట నూనె రాసుకొని.. ఉదయాన్నే తలస్నానం చేసినా సరిపోతుంది. అయితే.. చాలా మంది రాత్రంతా జిడ్డు తలతో నిద్రపోవడం నచ్చదు. అలాంటివారు ఉదయాన్నే అరగంట ముందు రాసుకుంటే సరిపోతుంది.

జట్టులో నూనెను ఎంతసేపు ఉంచుకోవాలి?

షాంపూ చేసుకునే ముందు సాధారణ ఆయిల్ ట్రీట్‌మెంట్ కోసం అయితే, ముప్పై నిమిషాల నుండి కొన్ని గంటల సమయం సరైనది. మీ స్కాల్ప్‌పై ఎక్కువ సేపు నూనె ఉంచుకోవాల్సిన అవసరం లేదు. పొడి జుట్టు ఉన్నవారు రెగ్యులర్ గా నూనె రాసుకోవచ్చు. ఆయిల్ హెయిర్ ఉన్నవారు.. నూనె ఎక్కువగా రాయాల్సిన అవసరమే లేదు.

Read more Photos on
click me!

Recommended Stories