కొత్తబియ్యంతో ఈ స్పెషల్ రెసిపీలు ఓసారి ట్రై చేయండి.. ఎంత బాగుంటుందో?

First Published Nov 24, 2021, 1:29 PM IST

పండుగ సమయంలో దేవునికి నైవేద్యంగా చక్కెర పొంగలి, కొబ్బరి పొంగలి చేస్తుంటాం. అసలు మనకు పొంగలి అనే పేరు వినగానే గుర్తొచ్చేది కొత్తబియ్యం. కొత్త బియ్యంతో (Rice) పొంగలి చేసుకుంటే చాలా రుచిగా (Tasty) ఉంటుంది. వీటి తయారీ విధానం చాలా సులభం. వీటిని చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా చక్కెర పొంగలి, కొబ్బరి పొంగలి తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

చక్కెర పొంగలి (Chakkera pongali) తయారీ విధానానికి కావలసిన పదార్ధాలు: ముప్పావు కప్పు బియ్యం (Rice), పావు కప్పు పెసరపప్పు (Moong dal), సగం స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), చిటికెడు పచ్చ కర్పూరం (Emerald camphor), నెయ్యి (Ghee), సగం కప్పు బెల్లం (Jaggery), ముప్పావు కప్పు చక్కెర (Sugar) జీడిపప్పు (Cashew), కిస్మిస్ (Raisins).

తయారీ విధానం: ముందుగా పెసరపప్పును ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పును బియ్యంతో పాటు కుక్కర్ లో వేసి ఎక్కువ మంట (High flame) మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు బాండ్లీలో పంచదార, బెల్లం, కొన్ని నీళ్లు పోసి తీగపాకం కంటే తక్కువగా పాకాన్ని (Caramel) తయారు చేసుకోవాలి.

ఇలా తయారుచేసుకున్న పాకాన్ని ఉడికించుకున్న అన్నంలో కలిపి తక్కువ మంటమీద మరొకసారి ఉడికించాలి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. నెయ్యి వేయడంతో చక్కెర పొంగలి మరింత రుచిగా ఉంటుంది. ఇందులో చివరలో యాలకుల పొడి పచ్చకర్పూరం, నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ లను వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి రెడీ.

కొబ్బరి పొంగలి (Kobbari pongali) తయారీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం (Rice), పావు కప్పు పెసర పప్పు (Moong dal), ఆవాలు (Mustard), జీలకర్ర (Cumin) మిరియాలు (Pepper), జీడిపప్పు (Cashew), పచ్చిమిర్చి (Chilies), అల్లం (Ginger) తరుగు, కరివేపాకు (Curries), రుచికి సరిపడు ఉప్పు (Salt), రెండు టేబుల్ స్పూన్ ల పచ్చి కొబ్బరి తురుము (Coconut grater). 

తయారీ విధానం: ఫ్రై చేసుకున్న పెసరపప్పును బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, మిరియాలు   అల్లం తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల కంటే కొంచెం ఎక్కువ నీరు, రుచికి సరిపడు ఉప్పు, పెసరపప్పు బియ్యం వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి తక్కువ మంట (Low flame) మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఇందులో పచ్చి కొబ్బరి తురుము (Coconut grater) వేసి కలుపుకోవాలి. అంతే కొబ్బరి పొంగల్ రెడీ.

click me!