కోవిడ్ తరువాత జుట్టు బాగా రాలిపోతోందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..

First Published Aug 3, 2021, 12:41 PM IST

కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్న రెండు, మూడు నెలల తరువాత ఈ జుట్టు సమస్య మొదలవుతుంది. కరోనా సమయంలో కానీ, కోలుకున్న వెంటనే కానీ కనిపించకపోవడం గుర్తించాలి. 

కరోనా బారినపడి కోలుకున్న వారిలో కరోనా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సివియర్ గా ఉంటున్నాయి. శరీరం నీరసించి పోవడం.. మునుపటి ఉత్సాహం లేకపోవడం, మానసికంగా కృంగిపోవడం, బలహీనంగా తయారవడం.. రోగ నిరోధక శక్తి తగ్గడం లాంటివి అనేకం కనిపిస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న సంతోషం ఈ రకరకాల సమస్యలతో ఎక్కువ కాలం నిలవడం లేదు. దీనికోసం జీవనశైలిలో మార్పులు చేసుకోకవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని, అలవాట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
undefined
అలా, కరోనా నుంచి బయటపడిన తరువాత వచ్చే అనేక సమస్యల్లో ఒకటి జుట్టు రాలిపోవడం. కరోనా నుంచి కోలుకున్న తరువాత చాలామంది తీవ్రమైన హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారు. అయితే దీనికి నిపుణులు కారణాలు క్లియర్ గానే చెబుతున్నారు. కరోనా సమయంలో శారీరకంగా బలహీనపడిపోవడం, మానసికంగా తీవ్ర ఒత్తడికి గురవ్వడంతో హెయిర్ ఫాల్ జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
undefined
కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్న రెండు, మూడు నెలల తరువాత ఈ జుట్టు సమస్య మొదలవుతుంది. కరోనా సమయంలో కానీ, కోలుకున్న వెంటనే కానీ కనిపించకపోవడం గుర్తించాలి. దీని వల్ల జుట్టు రాలిపోవడం కరోనా కారణంగానే అనే విషయాన్ని మరిచిపోతుంటారు. అందుకే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కూడా కాస్త అప్రమత్తంగా ఉంటుంటారు.
undefined
దీనికి కారణం ఏంటి అంటే.. కరోనా వైరస్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రమైన భయాందోళనలు. పాజిటివ్ రాగానే మనిషి శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కృంగిపోవడం. పాజిటివ్ నిర్థారణ కాగానే మెంటల్ షాక్ కు గురవ్వడం, ట్రీట్మెంట్ సమయంలో ఒంటరిగా ఉండాల్సి రావడం, నెగెటివ్ వచ్చేదాకా సాగే మానసిక ఆందోళనలు.. వెరసి హెయిర్ ఫాల్ కి కారణమవుతాయి.
undefined
మరి ఈ హెయిర్ ఫాల్ కు చికిత్స లేదా? అంటే అద్భుతమైన చికిత్స ఇంట్లోనే అందుబాటులో ఉంది. కరోనా కారణంగా ఏర్పడిన జుట్టు సమస్యను ఈజీగా అధిగమించవచ్చు. అలాంటి ఐదు హోమ్ రెమెడీస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. వీటిని ట్రై చేయడం వల్ల ఇంట్లోనే ఎలాంటి ఖర్చూ లేకుండా పూర్వపు జుట్టును పొందచ్చు.
undefined
రాలే జుట్టుకు కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రాలే జుట్టును నివారించి.. కొత్త జుట్టు పెరగడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇది ఇలా అప్లై చేయాలి అంటే.. కొబ్బరినూనెను వేడి చేసి.. గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
undefined
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇటీవలి కాలంలో హెయిర్ ప్రాడక్ట్స్ లో ఉల్లిపాయను కలపడం తెలిసిందే. ఉల్లిపాయలో అధికమొత్తంలో సల్ఫర్ ఉంటుంది. ఇది కొత్త జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించి గంటసేపటి తరువాత తలస్నానం చేయాలి. ఉల్లిపాయ రసానికి తేనె కూడా కలిపి పెట్టుకోవచ్చు.
undefined
కోడిగుడ్లు ఎంతో బలవర్థకమైన ఆహారం. ఇందులో ఐయోడిన్, సల్ఫర్, పాస్ఫరస్ లతో పాటు అధిక మొత్తంలో పోషకాలూ ఉంటాయి. అందుకే మీ రోజువారీ ఆహారంలో గుడ్లను తప్పనిసరిగా చేర్చాలి. దీనివల్ల జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. ఒక వేళ మీరు గుడ్డు తినకపోతే ఎగ్ వైట్స్ ను తలకు పట్టించి, ఆరిన తరువాత తలస్నానం చేయడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
undefined
కోడిగుడ్లు ఎంతో బలవర్థకమైన ఆహారం. ఇందులో ఐయోడిన్, సల్ఫర్, పాస్ఫరస్ లతో పాటు అధిక మొత్తంలో పోషకాలూ ఉంటాయి. అందుకే మీ రోజువారీ ఆహారంలో గుడ్లను తప్పనిసరిగా చేర్చాలి. దీనివల్ల జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. ఒక వేళ మీరు గుడ్డు తినకపోతే ఎగ్ వైట్స్ ను తలకు పట్టించి, ఆరిన తరువాత తలస్నానం చేయడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
undefined
ఉసిరిలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని అరికట్టడంతో బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఉసిరి రసాన్ని, నిమ్మకాయ రసంలో కలిపి తలకు పట్టించాలి. ఆరిన తరువాత తలస్నానం చేయాలి. దీంతోపాటు మీరు ఈ రెండింటినీ కలిసి.. దానికి కాస్త ఉప్పు, తేనె కలిపి తాగొచ్చు కూడా.
undefined
ఫిష్ ఆయిల్ : యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఒమెగా-3 సప్లిమెంట్లు ఉండేలా చూసుకోండి. దీనివల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. రాలడం తగ్గిపోతుంది. అంతేకాదు వీటివల్ల జుట్టుకే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుుతుంది. ఇది మీ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
undefined
click me!