చాలా మందికి సెక్స్ చేయాలని కోరిక ఉన్నా.. బెడ్రూంలోకి అడుగుపెట్టిన తర్వాత.. ఆ మూడ్ రావడం లేదని.. అందుకే.. రోజూ అదే పడకగదిలో చేయాలంటే బోరింగ్ గా ఉంటోందంటూ చెబుతుంటారు. నిజమే.. ప్రతిరోజూ ఒకే బెడ్రూం లో ఒకేలా చేస్తే... బోర్ కొట్టే అవకాశం ఉంది. అయితే.. కొన్ని రకాల మార్పులు చేసుకుంటే మాత్రం ఎప్పటికీ ఆఫీలింగ్ రాదట.
మనకు కళ్లకు పడకగది శుభ్రంగా కనిపించినా.. రొమాంటిక్ మూడ్ రావాలంటే దానికి అదనపు హంగులు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎలాంటి మార్పులు చేస్తే.. రొమాంటిక్ భావన కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.
Bed Room-Romantic
రొమాంటిక్ ఫీలింగ్ కలగాలి అంటే.. మంచి సువాసనలు వెదజల్లాలి. గదిలోకి అడుగుపెట్టగానే.. మనసు తేలిపోతున్న భావన కలగాలి. ఇక బెడ్ మీద పడుకున్న తర్వాత హాయి గా అనిపించాలి. ఇలా జరగాలంటే.. పిల్లో మిస్ట్ వాడాలట. ఈ పిల్లో మిస్ట్.. మంచి సువాసనలను వెద జల్లుతుంది. దీనిని సహజ వృక్షాల నుంచి తయారు చేశారు. మంచి వాసనను.. ఫీల్ గుడ్ కలిగిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు సైతం దీనిని వాడితే.. ప్రశాంతంగా నిద్రపోగలుగుతారట.
bed room 1
పడక గది ఎంత అందంగా అలంకరించినా.. మన దగ్గర తాజాదనం లేకపోతే ఏం చేస్తాం. అందుకే.. మనం తాజాగా ఉండాలి. అలా ఉండాలి అంటే.. ముందుగా స్నానం చేయాలి. ఆ స్నానంలో బాత్ సోక్స్ వాడాలట. ఈ బాత్ సోక్స్ మార్కెట్లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడితే.. రొమాంటిక్ మూడ్ వచ్చేస్తుంది. స్వర్గంలో ఉన్నామనే భావన కలుగుతుంది.
milk bath
ఇక గదిలో మంచి సువాసనలు వెద జల్లేందుకు.. చాలా మంది మార్కెట్లో లభించే వాటిని వాడుతుంటారు. వాటికి బదులు సహజ సిద్ధమైన వాటిని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగంటే.. మీకు నచ్చిన పూలను ఎంచుకొని వాటిని ఎండనివ్వాలి. అలా ఎండిన వాటిని.. ఓ గాజు సీసాలో వేసి.. దానిలో ఎసెన్షియల్ ఆయిల్స్ పోయాలి. అప్పుడు మంచి సువాసనలు వెద జల్లుతాయి.
winter garden
మంచి సహజ నూనెలతో బాడీ మసాజ్ చేసుకోవాలి. ఇది బాడీకి రిలాక్సేషన్ ఇస్తుంది.
hot oil massage
ఇక కొబ్బరి నూనెతో తయారు చేసిన క్యాండిల్స్ ని బెడ్రూంలో పెట్టుకోవాలి. ఇవి కూడా మంచి ఫీలింగ్ ని కలిగిస్తాయి.
Candle Color