చక్కటి చర్మ సౌందర్యానికి పుదీనా... ఎన్ని ప్రయోజనాలో..

First Published Aug 2, 2021, 4:41 PM IST

ఫేస్ వాష్‌లు, మాయిశ్చరైజర్లు, లోషన్‌ల వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో పుదీనా ఆకులు కీలకపాత్ర పోషిస్తాయని మీకు తెలుసా. పుదీనా ఆకుల్లో చర్మ ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. పుదీనా ఆకుల బలమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అద్భుతమైన క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్‌ లుగా పనిచేస్తాయి.

పుదీనా ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని ఘాటైన వాసన దీనిలోని ఔషధగుణాలు, ఆరోగ్య సుగుణాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే పుదీనా చర్మ సంరక్షణలో కూడా అద్బుతంగా పనిచేస్తుందన్న విషయం మీకు తెలుసా?
undefined
ఫేస్ వాష్‌లు, మాయిశ్చరైజర్లు, లోషన్‌ల వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో పుదీనా ఆకులు కీలకపాత్ర పోషిస్తాయని మీకు తెలుసా. పుదీనా ఆకుల్లో చర్మ ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. పుదీనా ఆకుల బలమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అద్భుతమైన క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్‌ లుగా పనిచేస్తాయి. అందుకే రోజువారీ చర్మ సంరక్షణలో పుదీనా ఆకులను వాడడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో మీరే చూడండి.
undefined
మొటిమలకు చికిత్స : పుదీనా ఆకులలో సాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంలో సెబమ్ ఆయిల్ స్రావాన్ని నియంత్రిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు ఎక్కువగా మొటిమలతో బాధపడుతుంటారు. అయితే పుదీనా ఆకుల్లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమల వల్ల చర్మం మీద వచ్చే మంటను నివారిస్తాయి. మొటిమలను నయం చేస్తాయి. దీనికోసం ఏం చేయాలి అంటే.. పుదీనా ఆకుల పేస్ట్‌ని మొటిమలపై అప్లై చేసి, అది ఆరిపోయే వరకు 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇది మొటిమల మచ్చలను తొలగిస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది.
undefined
గాయాలను నయం చేస్తుంది : పుదీనా ఆకులలో ఉండే బలమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కోతలు, గాయాలు, దోమ కాటు, చర్మం మీద దురదలను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం పుదీనా ఆకుల రసాన్ని చర్మం మీద ప్రభావిత ప్రాంతాల్లో రాయాలి. ఇది గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. గాయాలు, దురదల వల్ల చర్మం మీద ఏర్పడే చికాకు, మంటను తొలగించి ఉపశమనం చేస్తుంది.
undefined
గాయాలను నయం చేస్తుంది : పుదీనా ఆకులలో ఉండే బలమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కోతలు, గాయాలు, దోమ కాటు, చర్మం మీద దురదలను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం పుదీనా ఆకుల రసాన్ని చర్మం మీద ప్రభావిత ప్రాంతాల్లో రాయాలి. ఇది గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. గాయాలు, దురదల వల్ల చర్మం మీద ఏర్పడే చికాకు, మంటను తొలగించి ఉపశమనం చేస్తుంది.
undefined
చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది : చర్మాన్ని సహజసిద్ధంగా టోనింగ్ చేసే ఆస్ట్రింజెంట్ గా పుదీనా ఆకులు పనిచేస్తాయి. ఇవి చర్మ రంధ్రాల నుంచి మురికిని తొలగిస్తాయి. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతేకాదు చర్మంలోని తేమను పెంపొందించి హైడ్రేటెడ్ టోన్‌గా పునరుద్ధరిస్తుంది. ఇది మీ చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖం మీది ముడతలు, చక్కటి గీతలను కూడా నివారిస్తుంది. పుదీనా ఆకుల ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి, 20 నుండి 25 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రమైన నీటితో కడిగేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
undefined
డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది : కళ్ల చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు మొహాన్ని అందవిహీనంగా మార్చేస్తాయి. అయితే పుదీనా ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. దీనికోసం మీరు చేయాల్సింది పెద్దగా ఏమీ ఉండదు. మీరు చేయాల్సిందల్లా పుదీనా ఆకుల పేస్ట్‌ని డార్క్ సర్కిల్స్‌పై అప్లై చేసి, రాత్రిమొత్తం అలాగే ఉంచేసుకోవాలి. దీనివల్ల కళ్ల కింద చర్మం రంగు కాంతివంతంగా మారుతుంది. నల్లటి వలయాల రూపం రోజురోజుకూ తగ్గిస్తుంది.
undefined
చర్మం రంగును మెరిపిస్తుంది : పుదీనా ఆకులలో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఈ లక్షణాలు నిరంతర కాలుష్యం వల్ల చర్మం మీద మచ్చలు, దద్దుర్లు రాకుండా చేస్తుంది. నేరుగా ఎండలో ఎక్కువ కాలం ఉండడం వల్ల చర్మానికి కలిగే హానిని కూడా తగ్గిస్తుంది. అందుకే మచ్చలేని, మెరిసే లుక్ కోసం మీ డల్ చర్మానికి పుదీనా ఆకు రసాన్ని రాయండి. దీంతో మంచి ఫలితాలు కావాలంటే నెలకోసారి ఇలా చేసి చూడండి.. అద్భుతమైన ఫలితాలతో మీరే ఆశ్చర్యపోతారు.
undefined
click me!