ఎంత ప్రయత్నించినా సిగరేట్ మానలేకపోతున్నారా? ఇలా చేస్తే పక్కాగా ఈ అలవాటు పోతుంది తెలుసా..

First Published Jan 31, 2023, 2:01 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి అర్థాంతరంగానే చనిపోతున్నారు. ఈ క్యాన్సర్ కు ప్రధాన కారకం సిగరేట్. అవును పొగాకే క్యాన్సర్ తో పాటుగా ఎన్నో రోగాలకు ప్రధానకారకంగా మారిపోయింది. ఈ పొగాకుకు ఒక్కసారి అలవాటైతే ఇక దాన్ని వదిలించుకోవడం అంత సులువు కాదు. మానుదామని మానలేకపోతున్నవారు ఎందరో ఉన్నారు. 

సిగరేట్ ను కాల్చడం ఆరోగ్యానికి హానికరం అన్న ముచ్చట సిగరేట్ డబ్బాపైనే ఉంటుంది. అయినా దీన్ని కొని తాగే వారు చాలా మంది ఉన్నారు. నిజానికి ఈ సిగరేట్ ను కాల్చడం సరదాగా  అలవాటు అయినా.. ఇది రానురాను వ్యసనంలా మారుతుంది. ఇది మిమ్మల్ని బానిస చేసుకుంటుంది. ఆరోగ్యం దెబ్బతింటుందని మానేద్దాం అని మానలేక అలాగే తాగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. సిగరేట్ల వల్ల క్యాన్సర్ తో పాటుగా ఎన్నో రోగాలు వస్తాయి. సిగరేట్ కాల్చేవారి ఆరోగ్యాన్నే కాదు.. వీళ్ల చుట్టూ ముట్టూ ఉన్నవారి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మీకు తెలుసా? ఈ స్మోకింగ్ పురుషుల కంటే మహిళల ఆరోగ్యంపైనే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందట.  

నిజానికి స్మోకింగ్ కు బానిసలుగా మారినా దీని నుంచి బయటపడాలని చాలా మంది భావిస్తుంటారు. ఎన్నో ప్రయత్నాలను కూడా చేస్తుంటారు. కానీ ఫలితం మాత్రం ఉండదు. దాన్నీ తాగకుండా ఉండలేకపోతుంటారు. అయితే మీరు ఈ వ్యసనం నుంచి బయటపడటానికి కొన్ని ఎఫెక్టీవ్ చిట్కాలను పాటించండి. తప్పకుండా స్మోకింగ్ అలవాటును తొందరగా మానుకుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

స్వీయ ప్రేరణ

స్మోకింగ్ ను ఖచ్చితంగా మానాలనుకుంటే స్వీయ ప్రేరణ చాలా చాలా అవసరం. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటే కాని పని ఏదీ ఉండదు. అందుకే సిగరేట్ మానడానికి మిమ్మల్ని మీరు సిద్దం చేసుకోండి. మీ అంతల మీరు సిగరేట్ మానాలనుకునేవరకు మీరు ఎవరు చెప్పినా.. ఎంత చెప్పినా దీని నుంచి అస్సలు బయటపడరు. అందుకే ఇకనుంచి మిమ్మల్ని మీరు లోపలి నుంచి సిగరేట్ మానేద్దామని సిద్దం చేసుకోండి. దీనికోసం స్మోకింగ్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో చదవడం. అలాగే సిగరేట్ మానడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో కూడా తెలుసుకోండి. 
 

యాంటీ ఆక్సిడెంట్లు 

స్మోకింగ్ వల్ల మీ శరీరమంతా దెబ్బతింటుంది. అయితే మీ శరీరంపై ధూమపానం ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి.. బీటా కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పోషకాలు సాధారణంగా తాజా పండ్లు, కూరగాయలలో ఉంటాయి.
 

కూరగాయల రసం 

మీరు స్మోకింగ్ ను మానేయాలనుకుంటే ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఒక గ్లాసు వెజిటేబుల్ జ్యూస్ ను తాగండని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ మీ శరీరానికి అవసరమైన పోషకాలన్నింటినీ అందిస్తుంది. అలాగే  ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది స్మోకింగ్ వల్ల కలిగే చర్మ నష్టాన్ని సరిచేయడానికి కూడా సహాయపడుతుంది. దీనితో పాటుగా సిగరేట్లను కాల్చడం తగ్గిస్తుంది. 
 


 ఆల్కలీన్ డైట్ 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, ఆల్కలీన్ డైట్ మీ రెగ్యులర్ డైట్ లో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. కాయధాన్యాలు, బ్రాన్, జొన్నలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీపిని తినడం, స్మోకింగ్ చేయాలన్న కోరికలను నియంత్రించడానికి సహాయపడతాయి. 
 

స్మోకింగ్ వల్ల మీరు ముసలివాళ్ల లాగా కనిపిస్తారు. స్మోకింగ్ మీ చర్మాన్ని తొందరగా ముడతల బారిన పడేస్తుంది. అలాగే నిర్జీవంగా కూడా మారుతుంది. అందుకే చాలా మంది ఆడవారు ఈ కారణంగానే స్మోకింగ్ కు దూరంగా ఉంటారు. ధూమపాన వ్యసనం చర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.మీరు నిజంగా ధూమపానం మానేయాలనుకుంటే మీ ఆహారంలో చేపలు, నారింజ, ఆకుపచ్చ పండ్లు, కూరగాయలతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ కలిగిన కొన్ని ముఖ్యమైన నూనెలు, ఆహారాలను చేర్చండి. ఇవి మీ ధూమపాన కోరికలను నియంత్రిస్తాయి. అలాగే మీ చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. 

click me!