సర్వరోగాలను ఒక్క స్పూన్ తో తరిమికొట్టే అద్భుత పదార్ధం.. అదేంటంటే?

Navya G   | Asianet News
Published : Feb 19, 2022, 03:22 PM IST

తేనెలో (Honey) అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ప్రకృతి ప్రసాధించిన ఒక గొప్ప వరం. దీనిని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. తేనెను తీసుకుంటే  ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అనేకం. మరి ఇప్పుడు మనం తేనెతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి తెలుసుకుందాం..

PREV
110
సర్వరోగాలను ఒక్క స్పూన్ తో తరిమికొట్టే అద్భుత పదార్ధం.. అదేంటంటే?

నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి: నిద్రకు ముందు తేనెను తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు (Insulin levels) మెరుగుపడి మెదడులో ట్రిప్టోపాన్ అనే హార్మోను విడుదల అవుతుంది. ఇది నెమ్మదిగా సెరోటోనిన్ గా మార్చి మంచి నిద్రను ఇస్తుంది. దీంతో నిద్రలేమి సమస్యలు (Insomnia problems) తగ్గుతాయి.
 

210

కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది: తేనెను తీసుకుంటే గ్లూకోజ్ విడుదలకు సహాయపడుతుంది. అలాగే ఈ గ్లూకోజ్ కొవ్వు కరిగించే హార్మోన్ల విడుదలకు సహాయపడుతుంది. తేనెలో వుండే ప్రక్టోస్ (Practose), గ్లూకోజ్ కాలేయం (Liver) పనితీరును మెరుగుపరుస్తుంది.
 

310

దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది: రాత్రి నిద్రించే ముందు తేనెను తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. తేనెలో యాంటీ ఫంగల్ (Antifungal) లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక దగ్గును (Cough) తగ్గించి మంచి నిద్ర వచ్చేలా సహాయపడతాయి.

410

బ్యాక్టీరియాను చంపుతుంది: పాలలో తేనె కలుపుకుని సేవిస్తే శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను బయటకు పంపించి జీర్ణక్రియ (Digestion) సాఫీగా సాగేలా సహాయపడుతుంది. అలాగే శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను (Bacteria) చంపుతుంది.
 

510

చర్మ నిగారింపును పెంచుతుంది: దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మసౌందర్యానికి (Skin beauty) సహాయపడతాయి. చర్మ కణాలలోని మృత కణాలను (Dead cells) నశింపచేసే చర్మానికి మంచి నిగారింపును అందిస్తుంది.

610

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది: తేనెలో ఉండే ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను (Sugar levels) కలవడాన్ని నెమ్మదిపరుస్తాయి. కనుక  మధుమేహం (Diabetes) నియంత్రణలో ఉంటుంది. దీంతో శరీరానికి మధుమేహ ప్రమాద తీవ్రత తగ్గుతుంది.

710

దంతాల నొప్పిని తగ్గిస్తుంది: దంతాల నొప్పితో బాధపడే వారు ఒక టీస్పూన్ దాల్చిన‌చెక్క పొడిలో (Cinnamon powder), ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి (Honey) క‌లిపి దంతాల‌పై నొప్పి ఉన్న చోట రాయాలి. దీంతో దంతాల నొప్పి త‌గ్గుతుంది. అలాగే చిగుళ్ల స‌మ‌స్యలు కూడా త‌గ్గుతాయి.

810

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: తేనెలో ఉండే అనామ్లజనకాలు (Antioxidants) శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడానికి సహాయపడతాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి కాపాడి శరీరానికి కావలసిన తగిన శక్తిని అందిస్తాయి.

910

తల నొప్పిని తగ్గిస్తుంది: దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడేవారు రెండు టేబుల్ స్పూన్ ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌లో (Apple cider vinegar) ఒక టేబుల్ స్పూన్ తేనె (Honey) కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

1010

అధిక బరువును తగ్గిస్తుంది: అధిక బరువుతో బాధపడే వారు ఒక టీ స్పూన్ తేనె (Honey), సగం టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని (Cinnamon powder) తీసుకుని ఒక గ్లాసు వాటర్లో వేసి కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

click me!

Recommended Stories