గోరింటాకుతో ఎన్నిరకాల బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా.. ఈ 'టిప్స్'తో ఒతైన జుట్టు మీ సొంతం!

First Published Nov 23, 2021, 3:40 PM IST

జుట్టు సంరక్షణ (Hair care) కోసం అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. జుట్టుకు మంచి కలర్, ఒత్తుగా పెరగడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నంలో ఎక్కువ మోతాదులో బయట దొరికే ఆర్టిఫిషియల్ క్రీమ్స్ ను అప్లై చేస్తుంటారు. వీటిని ఉపయోగించడంతో జుట్టు సహజ సిద్ధమైన నిగారింపు కోల్పోయి అనేక  సమస్యలు ఎదుర్కొంటాం.ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే సహజసిద్ధమైన పద్ధతులను (Natural methods) ఉపయోగించడం మంచిది.
 

ఇందుకోసం ఇంట్లోనే హెన్నాతో (Henna) చేసుకున్న ప్యాక్ లను ఉపయోగించడం మంచిది. గోరింటాకు జుట్టుకు ఒక అద్భుతమైన నేచురల్ హెయిర్ డై. ఇందులో ఉన్న అద్భుతమైన లక్షణాల కారణంగా జుట్టుకు ఎక్కువ  ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో జుట్టు సంరక్షణ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా హెన్నాతో హెయిర్ డై ఎలా చేసుకోవాలి దానితో కలిగే ప్రయోజనాల (Benefits) గురించి తెలుసుకుందాం..
 

ఒక కప్పు హెన్నా పౌడర్(Henna powder), రెండు స్పూన్ ల మెంతి పొడి (Fenugreek powder), రెండు స్పూన్ ల శీకాకాయపొడి (Shikakai powder), రెండు స్పూన్ ల ఆమ్లా (Amla), కొద్దిగా టీ డికాషన్ పౌడర్ (Tea decoction powder) వేసి కలుపుకోవాలి. జుట్టు మంచి కలర్ రావడానికి ఇందులో బీట్ రూట్ జ్యూస్ (Beetroot Juice) కూడా కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో గుడ్డు (Egg) ఒకటి వేసి బాగా కలుపుకుని ఐదు గంటల పాటు నానబెట్టాలి.
 

ఇలా నాన పెట్టుకున్న మిశ్రమాన్ని జుట్టుకు బాగా అప్లై చేసి గంట తరువాత తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడంతో ఇందులో ఉండే అన్ని పోషకపదార్థాలు జుట్టు బలంగా, ఒత్తుగా (Consistently) పెరగడానికి సహాయ పడతాయి. ఇలా కనీసం 15 రోజులకు ఒకసారి అయినా చేయాలి. అప్పుడే జుట్టు సంరక్షణ బాగుంటుంది. ఈ హెన్నాను జుట్టుకు మంచి కండిషనర్ (Conditioner) గా కూడా అప్లై చేసుకోవచ్చు. కండిషనర్ గా వాడాలి అనుకున్నప్పుడు ఈ మిశ్రమాన్ని అరగంట నానబెట్టుకుని అప్లై చేసుకుంటే చాలు.
 

ఈ హెన్నాను అప్లై చేసుకోవడంతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. హెన్నా నేచురల్ హెయిర్ డై (Natural Hair Dye). ఈ హెన్నాను అప్లై చేసుకోవడంతో జుట్టుకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) ఉండవు. ఇది జుట్టుకు మంచి కలర్ ను ఇస్తుంది. సహజ సిద్ధంగా తయారు చేసుకున్న హెన్నా జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది.
 

ఇది జుట్టుకు తగిన పోషకాలను అందించి ఆరోగ్యంగా (Healthy) ఉంచుతుంది. తలలో ఉండే ఎటువంటి ఇన్ఫెక్షన్లు అయినా తగ్గించే గుణం హెన్నాకు ఉంది. రెగ్యులర్గా హెన్నా తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇది జుట్టుకు నేచురల్ కలర్, నేచురల్ షైనింగ్ ను ఇస్తుంది. ఆర్టిఫిషియల్ గా దొరికే క్రీమ్స్ కంటే ఇలా హెన్నాను (Henna) తయారు చేసుకుంటే జుట్టు సంరక్షణ బాగుంటుంది.

click me!