బీట్ రూట్ హెయిర్ మాస్క్ తో.. జుట్టు సమస్యలన్నీ మటుమాయం

First Published Jan 26, 2023, 12:58 PM IST

బీట్ రూట్ మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి, జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బీట్ రూట్ హెయిర్ మాస్క్ వల్ల మీ జుట్టు పొడుగ్గా, అందంగా పెరుగుతుంది. 
 

మారుతున్న వాతావరణం, అనారోగ్యకరమైన జీవనశైలి జుట్టు రాలడానికి కారణమవుతుంది. చాలా కాలంగా జుట్టు రాలుతున్నా.. బిజీ లైఫ్ స్టైల్ వల్ల జుట్టును పట్టించుకోని వారు చాలా మందే ఉన్నారు. కానీ దీనివల్ల కూడా జుట్టు మరింత ఎక్కువ రాలే అవకాశం ఉది. అంతేకాదు జుట్టు చాలా బలహీనంగా కూడా మారిపోతుంది. ముఖ్యంగా జుట్టును తరచుగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల చుండ్రు సమస్య ఎక్కువ అవుతుంది. ఇది కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. అయితే ఎలాంటి జుట్టు సమస్యలలైనా బీట్ రూట్ హెయిర్ మాస్క్ ఇట్టే తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవును దీన్ని 3 నుంచి 4 సార్లు వాడటం వల్ల జుట్టు రాలడం ఆగిపోయింది. అలాగే చుండ్రు, డ్రై హెయిర్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ముందుగా బీట్ రూట్ మన జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో తెలుసుకుందాం.. 

చుండ్రును తగ్గిస్తుంది.

నెత్తి పొడిబారడం, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల చుండ్రు పెరుగుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి బీట్ రూట్ ఎంతో సహాయపడుతుంది. బీట్ రూట్ లో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇది నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే నెత్తిని తేమగా ఉంచుతుంది. 
 

జుట్టు రాలడాన్నిఆపుతుంది

జుట్టు బలాన్ని కాపాడుకోవడానికి ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం చాలా చాలా అవసరం. ఈ పోషకాలకు బీట్ రూట్ ఉత్తమ వనరు. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యంగా ఉంటాయి.
 

నేచురల్ హెయిర్ కలర్

బీట్ రూట్ లో నేచురల్ హెయిర్ కలర్ ఉంటుంది. మీరు పార్టీకి లేదా ఫంక్షన్ కు వెళ్లాలనుకున్నప్పుడు హెయిర్ కలర్ ను వేసుకోవాలనుకుంటే.. బీట్రూట్ మంచి ఎంపిక. ఇది మీ జుట్టు అందంగా మెరవడానికి సహాయపడుతుంది. 


జుట్టు సమస్యలకు హెయిర్ మాస్క్ లు 

బీట్రూట్ , వేప హెయిర్ మాస్క్

ముందుగా రెండు బీట్ రూట్ లను తీసుకుని జ్యూస్ గా చేయండి. దీనిలో అరకప్పు వేప నీళ్లు కలపండి. చివరగా అందులో సగం నిమ్మరసం వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కొద్ది సేపు తలను మసాజ్ చేయండి. అరగంట తర్వాత జుట్టును నీట్ గా కడగండి. 

మీకు చుండ్రు సమస్య ఉంటే ఈ హెయిర్ మాస్క్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పబ్మెడ్ సెంట్రల్ చేసిన పరిశోధనలో.. చుండ్రును తగ్గించడంలో వేప ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని తేలింది. వేప చికాకును, నెత్తిమీద పొడిబారడం వంటి సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. నిమ్మలో విటమిన్ సితో పాటు ఫోలిక్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జుట్టును స్మూత్ గా, హెల్తీగా మార్చడంతో పాటుగా నెత్తిమీద దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 


బీట్రూ, కాఫీ హెయిర్ మాస్క్

ముందుగా మూడు బీట్ రూట్ లను తీసుకుని జ్యూస్ గా చేయండి. తర్వాత దీనికి తగినంత కాఫీ పౌడర్ ను కలపండి. అలాగే రెండు టీస్పూన్ల నిమ్మరసం కూడా వేయండి. వీన్నింటిని మిక్స్ చేసి తలకు మసాజ్ చేసి జుట్టు పొడవునా అప్లై చేయండి. అరగంట తర్వాత సాదా నీటితో తలస్నానం చేయండి.

వీల్ ఆన్లైన్ లైబ్రరీ ప్రకారం.. నెత్తికి కాఫీని ఉపయోగించడం వల్ల జుట్టు బలోపేతం అవుతుంది. దీంతో జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది. కాఫీ, బీట్ రూట్ మిశ్రమం జుట్టును బలోపేతం చేయడంతో పాటుగా జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

click me!