జుట్టు పొడుగ్గా పెరగాలా? అయితే వీటిని మరువకుండా తినండి

First Published Jan 22, 2023, 3:01 PM IST

జుట్టు బలంగా ఉండాలన్నా.. పొడుగ్గా పెరగాలన్నా పౌష్టికాహారం చాలా అవసరం.  కొన్ని రకాల ఆహారాలను తింటే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 
 

hair care

పొడవైన, ఒత్తైన జుట్టును కోరుకోని వారు ఎవరూ ఉండరు. కానీ జుట్టు అలా పెరగడానికి ప్రయత్నాలు చేసే వారు మాత్రం చాలా తక్కువే. జుట్టు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే.. జుట్టు సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు. జుట్టు సంరక్షణ చిట్కాలను పాటించడంతో పాటుగా పౌష్టికాహారం తీసుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ముఖ్యంగా కొన్ని ఆహారాలతో మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

soaked badam

బాదం పప్పులు

రోజూ గుప్పెడు బాదం పప్పులను తిండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం..  బాదం పప్పులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువును నియంత్రిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఈ గింజలు మీ జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.  ప్రోటీన్, ఐరన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, జింక్, విటమిన్ ఇ, విటమిన్ బి 1, విటమిన్ బి 6 పుష్కలంగా ఉండే బాదం జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడతాయి.

walnuts

వాల్ నట్స్

వాల్ నట్స్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. విటమిన్స్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్ జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఐరన్, జింక్, కాల్షియం, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి వాల్ నట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం  బాగుండటమే కాదు జుట్టు కూడా బలంగా పెరుగుతుంది. 
 

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలు  కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ ఇ ఈ విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు నెత్తిని ఆరోగ్యంగా ఉంచి..  జుట్టు రాలిపోకుండా కాపాడతాయి.

ఖర్జూరాలు

ఖర్జూరాలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇవి మన శరీరంలో రక్తాన్ని పెంచుతాయి. అలాగే ఎన్నో పోషక లోపాలను పోగొడుతాయి. ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జుట్టు  బాగా పెరుగుతుంది. 
 

చియా విత్తనాలు

చియా విత్తనాలు బరువు తగ్గడం నుంచి గుండెను హెల్తీగా ఉంచడం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.  చియా విత్తనాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో సహా ప్రోటీన్లు,  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి జుట్టు పొడుగ్గా పెరగడానికి ఎంతో సహాయపడతాయి.
 

వేరుశెనగలు

వేరుశెనగల్లో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, పొటాషియం, కాల్షియం, రాగి వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటిని రోజూ గుప్పెడు తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. 

click me!