బచ్చలికూర
బచ్చలికూరలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ కూర మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్కె, ఇనుము, ఫోలేట్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.