ఖచ్చితంగా బరువు తగ్గాలంటే ఈ పండ్లను, కూరగాయలను తినండి..

First Published Sep 23, 2022, 12:54 PM IST

ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమై ఆహారాన్ని తింటే బరువు తగ్గడం చాలా సులువు. చక్కెర, కొవ్వు, కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా ఉంటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు .

అతిగా తినడం, చెడు జీవన శైలి, ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. అధిక బరువు ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అందుకోసమే బరువు పెరగకుండా జాగ్రత్త పడాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఓవర్ వెయిట్ తో బాధపడేవారు కొన్ని రకాల పండ్లను, కూరగాయలను తింటే సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

బరువు ఎక్కువగా ఉండేవారు కార్భోహైడ్రేట్లు, కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. అలాగే నూనెలో వేయించి ఫుడ్స్ కు కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా కేలరీలు తక్కువగా ఉండే వాటినే తినాలి. బరువు తగ్గేందుకని మీరు ఎలాంటి డైట్ ను ఫాలో అయినా.. పండ్లు, కూరగాయలను తినడం  మాత్రం మర్చిపోకూడదు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇందుకోసం ఎలాంటి పండ్లు, కూరగాయలను తినాలో తెలుసుకుందాం పదండి. 

ఆపిల్

రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెల్లాల్సిన అవసరం లేదన్న ముచ్చట అందరికీ తెలుసు. ఆ ఆపిల్ పండు ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల త్వరగా ఆకలి కాదు. అలాగే ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా చేస్తుంది. దీనివల్ల మీరు సులువుగా బరువు తగ్గుతారు. ఈ పండులో ఉండే పెక్టిన్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. 

టమాటాలు

టమాటాలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో విటమిన్ సితో పాటుగా ఫైటో న్యూట్రియెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే టమాటాలను ఫ్యాట్ కిల్లర్ అని కూడా అంటారు. ఫైటోన్యూట్రియెంట్స్ కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బెర్రీలు

బెర్రీల్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ కొన్ని బెర్రీలను తింటే మీరు సులువుగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా బ్లూబెర్రీస్ కొవ్వును కరిగించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

జామ

జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో పెక్టిన్ కూడా ఉంటుంది. ఈ పెక్టిన్ కణాలను కొవ్వును శోషించుకోకుండా నిరోధిస్తుంది. రోజూ మోతాదులో జామకాయలను తింటే మీరు సులువుగా బరువును తగ్గగలుగుతారు. ఈ జామ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. పేగు కదలికలను కూడా మెరుగుపరుస్తుంది. 
 

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ లో ఫోలేట్, విటమిన్ కె, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్నందున.. వీటిని తినడం వల్ల ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. 
 

avocado

అవకాడో

అవకాడోలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. అవకాడోల్లో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు ఓవర్ గా తినలేరు. దీంతో మీరు బరువు తగ్గుతారు. 
 

పుచ్చకాయ

బరువు తగ్గాలనుకునే వారికి పుచ్చకాయ ది బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి. ఎందుకంటే పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. భోజనానికి ముందు పుచ్చకాయను తింటే మీ శరీరంలోకి అదనపు కేలరీలు వెల్లకుండా.. కడుపు తొందరగా నిండుతుంది. దీంతో ఫుడ్ ను ఎక్కువ తినాలనే కోరిక కూడా పోతుంది. 

click me!