తెల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా ట్రై చేసి చూడండి!

First Published Nov 8, 2021, 8:23 PM IST

బొల్లి (leucoderma) అనేది చర్మానికి సంబంధించిన వ్యాధి. ఇది అంటువ్యాధి కాదు. ఈ బొల్లి వ్యాధి వచ్చినప్పుడు చాలామంది మనోవేదనకు గురి అవుతుంటారు. బొల్లి అనేది హానికరమైన సమస్య కాదు. ఈ బొల్లి సమస్య వచ్చినప్పుడు చర్మం మొత్తం తెల్లగా మారిపోతుంది. బుల్లి సమస్యలను ఏ విధంగా తగ్గించుకోవాలో ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మన శరీరంలో అతి పెద్ద అవయవం చర్మమే (Skin). చర్మ జాగ్రత్త కోసం తగిన శ్రద్ధ అవసరం. మన శరీరంలో మెలనిన్ (Melanin) అనే కణాలు పని చేయకపోతే రంగు ఏర్పడదు. దాంతో మన చర్మం తెల్లగా మారుతుంది. మెలనిన్ కణాలు నల్ల రంగును ఉత్పత్తి చేస్తాయి. మెలనోసైట్స్ వాటంతటవే దెబ్బతినడం వల్ల కూడా చర్మం రంగు కోల్పోయి తెల్లగా మారుతుంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ప్రారంభంలో ఈ తెల్లమచ్చలు చిన్నగా ఉండి క్రమంగా పెద్దగా మారి శరీరమంతా వ్యాపిస్తుంది. దీనికి కొన్ని ఇంటి చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది.

ఈ వ్యాధి నివారణకు వేపాకులు (Neem leaves), తేనె (Honey) బాగా పనిచేస్తాయి. రెండు స్పూన్ ల వేపరసంలో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా చేస్తే బొల్లి వ్యాధిని నివారించడానికి మంచి ఫలితం ఉంటుంది. బొల్లి వ్యాధిని తగ్గించడానికి బకూచి బాగా పనిచేస్తుంది. బకూచి, వెనిగర్ కలిపి దాన్ని మచ్చలపై రాయాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. నెయ్యిలో (Ghee) కొన్ని మిరియాలు (Black paper) వేసి వేడి చేయాలి.  నెయ్యిలో మిరియాలను పక్కన తీసేసి ఈ నెయ్యిని ఆహారంలో ఉపయోగించాలి. ఇలా రోజు తీసుకోవడంతో రక్తం శుద్ధి అవుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగి బొల్లి వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తుంది.

వేప ఆకుల పేస్ట్ ను మజ్జిగలో కలిపి రాత్రిపూట మచ్చలు ఉన్న ప్రదేశంలో పోయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడంతో మంచి ఫలితం పొందుతారు. దానిమ్మ ఆకులలో (Pomegranate leaves) ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎండిన దానిమ్మ ఆకులను మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని బొల్లి ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి. బొల్లి తగ్గుముఖం పడుతుంది. బొల్లి వచ్చిన వారిలో ఒకవేళ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉంటే చక్కెరకు సంబంధించిన ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది. నిమ్మ, నారింజ వంటి సిట్రిక్ పండ్లను (Citric fruits) తినకూడదు. పెరుగులో గుడ్డు కలుపుకొని తినరాదు.

మీకేమైనా చర్మ సమస్యలు (Skin problems) ఉంటే రాత్రి పెరుగు తినకండి. దురదలు  (Itching) కలిగించే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. ఈ వ్యాధి లక్షణాలు చర్మంపై మొదట చిన్న చిన్న తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇలా ఉన్నప్పుడు దురద ఉండదు. చర్మం తెల్లబడటంతోపాటు వెంట్రుకలు కూడా తెల్లగా మారుతాయి. జుట్టు బాగా ఊడిపోతుంది. జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. బొల్లి బారిన పడడానికి వంశపారంపర్య జన్యు కారణాలు కావచ్చు.

click me!