'జోజోబా ఆయిల్'తో బ్యూటీ బెనిఫిట్స్.. ఇలా ఉపయోగిస్తే నిత్య యవ్వనం!?

Navya G   | Asianet News
Published : Feb 19, 2022, 04:32 PM IST

కలుషిత వాతావరణం, తీసుకునే ఆహారంలో పోషకలోపం కారణంగా అనేక చర్మ సమస్యలను (Skin problems) ఎదుర్కొంటున్నాము. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి జోజోబా ఆయిల్ (Jojoba Oil) ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని  సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. మరి చర్మ సౌందర్యం కోసం ఈ ఆయిల్ ను ఏవిధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

PREV
17
'జోజోబా ఆయిల్'తో బ్యూటీ బెనిఫిట్స్.. ఇలా ఉపయోగిస్తే నిత్య యవ్వనం!?

చర్మకణాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి కారణంగా మొటిమలు (Acne), మచ్చలు (Spots) ఏర్పడి ముఖం అందవిహీనంగా తయారవుతుంది. అలాగే జుట్టు సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి జోజోబా ఆయిల్ దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది.

27

ఇందులో విటమిన్ బి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), యాంటీ ఫంగల్ (Antifungal), యాంటీమైక్రోబయల్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె చర్మం తేమను కోల్పోకుండా చేస్తుంది. ఈ ఆయిల్ ను ఇతర ఆయిల్ తో పోలిస్తే తేలికగా ఉంటుంది. 

37

మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది: ఒక కప్పులో బంకమట్టి (Clay), జోజోబా నూనెను (Jojoba oil) వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మొటిమలు మచ్చలు తగ్గిపోతాయి. 
 

47

చర్మానికి మాయిశ్చరైజర్ గా సహాయపడుతుంది: ఒక కప్పులో రెండు స్పూన్ ల జోజోబా ఆయిల్ (Jojoba Oil), రెండు స్పూన్ ల కలబంద జెల్ (Aloevera gel) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ గా సహాయపడి చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది.

57

చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది: చర్మకణాలలో (Skin cells) పేరుకుపోయిన మృత కణాలను (Dead cells) తొలగించడానికి జోజోబా ఆయిల్ మంచి దివ్య ఔషధంగా సహాయపడుతుంది. జోజోబా ఆయిల్ ను ముఖానికి సున్నితంగా మర్దన చేసుకుని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది.

67

జుట్టు మృదువుగా మారుతుంది: జోజోబా ఆయిల్ ను తల కుదుళ్లకు జుట్టు మొత్తానికి సున్నితంగా మసాజ్ (Massage) చేసుకోవాలి. అరగంట తర్వాత గాఢత తక్కువ గల షాంపూతో తలస్నానం (Head bath) చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. జుట్టు కుదుళ్లకు కావలసిన తేమ అంది జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది.
 

77

చుండ్రు సమస్యలు తగ్గుతాయి: ఒక కప్పులో ఒక స్పూన్ నిమ్మరసం (Lemon juice), రెండు టేబుల్ స్పూన్ ల జోజోబా ఆయిల్ (Jojoba Oil) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేసుకోవాలి. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

click me!

Recommended Stories