Walking Benefits: చెప్పులు లేకుండా వాకింగ్ చేస్తే నిద్ర సమస్యలు రావా?

Published : Feb 07, 2025, 12:41 PM IST

మనలో చాలామంది రెగ్యులర్ గా వాకింగ్ చేస్తుంటారు. కానీ చెప్పులు వేసుకోకుండా ఎప్పుడైనా వాకింగ్ చేశారా? దానివల్ల ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా? బోలెడు ఉన్నాయట. అవెంటో ఇక్కడ చూసేయండి.

PREV
15
Walking Benefits: చెప్పులు లేకుండా వాకింగ్ చేస్తే నిద్ర సమస్యలు రావా?

వాకింగ్ ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మట్టిమీద చెప్పులు లేకుండా నడిస్తే ఇంకా మంచిదంటున్నారు నిపుణులు.

అలా నడిస్తే మట్టికి మనకు ఒక సంబంధం ఏర్పడుతుంది. ఇది శరీరంపై మంచి ప్రభావం చూపుతుందని జ్యోతిష్యం, మనస్తత్వ శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ కొన్ని నిమిషాలైనా ఎందుకు చెప్పులు లేకుండా నడవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చెప్పులు లేకుండా నడవటాన్ని చాలామంది ఇష్టపడరు. చెప్పులు వేసుకోకుంటే అనాగరికంగా భావిస్తారు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరిగేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మట్టిపై చెప్పులు లేకుండా నడవడం మంచిదట.

25
చెప్పులు లేకుండా నడిస్తే..

కండరాలు బలపడతాయి

చెప్పులు వేసుకుని నడిచేటప్పుడు పాద కండరాలు పెద్దగా పనిచేయవు. కానీ మట్టిపై చెప్పులు వేసుకోకుండా నడిస్తే పాద కండరాలకు, మట్టికి మధ్య బంధం, కదలిక ఏర్పడుతుంది. మట్టిలో పాదాల ఒత్తిడి వల్ల కండరాలు బలపడతాయి. చీలమండలు, పాదాలు దృఢంగా మారతాయి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా, పాదాలలో సరైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. 

నిద్ర బాగుంటుంది

చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల నిద్ర సమస్యలు తగ్గుతాయి. రాత్రిపూట గాఢ నిద్ర పడుతుంది. మనం బాగా నిద్రపోయినప్పుడు శరీరంలోని అంతర్గత అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. 

35
నొప్పుల నుంచి ఉపశమనం

ప్రతిరోజూ చెప్పులు వేసుకోకుండా నడిస్తే కాళ్ల నొప్పులు తగ్గుతాయి. చదునైన మట్టి నేలపై నడవడం మంచిది. గరుకుగా ఉండే ప్రదేశాలను ఎంచుకోవద్దు. ఇది నొప్పిని పెంచుతుంది. 

రక్తపోటు నియంత్రణ:

అధిక రక్తపోటు ఉంటే, దాన్ని నియంత్రించడానికి ప్రతిరోజూ చెప్పులు వేసుకోకుండా నడవచ్చు. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

45
బరువు తగ్గడం

అధిక బరువు ఉన్నవారు చెప్పులు వేసుకోకుండా నడిచేటప్పుడు ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తారు. ఎక్కువ కేలరీలు ఖర్చయి బరువు తగ్గే అవకాశం ఉంది. చెడు కొవ్వు కూడా కరగడం మొదలవుతుంది.

55
ఎందుకు మట్టిలో నడవాలి?

ప్రతిరోజూ ఒకేలా నడిస్తే.. శరీరానికి ఆ వ్యాయామాలు అలవాటు అయిపోతాయి. దీనివల్ల పెద్దగా మార్పు ఉండదు. కానీ అప్పుడప్పుడు మట్టిపై చెప్పులు వేసుకోకుండా నడవడం, గడ్డి మీద చెప్పులు వేసుకోకుండా నడవడం, ఎక్కువసేపు నడవడం, ఎక్కువ దూరం నడవడం లాంటివి చేస్తే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

 

Read more Photos on
click me!

Recommended Stories