1.రొమాంటిక్ డిన్నర్ చేయాలా..?
రొమాంటిక్ గా డిన్నర్ చేయాలంటే మీరు ఫలక్ నుమా ప్యాలెస్ వెళ్లాల్సిందే. చాలా లగ్జరీయస్ గా ఉండే ఈ రెస్టారెంట్ లో రాచరికాన్ని రుచి చూస్తూ మంచి భోజనం రుచి చూడవచ్చు. ఇక్కడ బిల్లు మాత్రం కాస్త ఎక్కువగా అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.
మీరు రొమాంటిక్ డిన్నర్ చేయడానికి మరో అద్భుతమైన ప్లేస్ ఆలివ్ బిస్ట్రో. ఇక్కడ మనోహరమైన వాతావరణం చాలా రొమాంటిక్ గా అనిపిస్తుంది.
నిజాం జ్యువెల్ - ది మినార్ (ది గోల్కొండ రిసార్ట్): విశాల దృశ్యాలు , ప్రామాణికమైన హైదరాబాదీ వంటకాలతో కూడిన సొగసైన, టవర్-శైలి రెస్టారెంట్.. ఇక్కడి నుంచి చూస్తే హైదరాబాద్ చాలా వరకు కనపడుతుంది.
ప్రీగో (ది వెస్టిన్): రొమాంటిక్ అవుట్‌డోర్ సీటింగ్ ప్రాంతం, వెచ్చని వాతావరణంతో కూడిన హాయిగా ఉండే ఇటాలియన్ రెస్టారెంట్.
వాటర్‌ఫ్రంట్ రెస్టారెంట్: హుస్సేన్ సాగర్ దగ్గరలో ఉండే ఈ రెస్టారెంట్ కూడా రొమాంటిక్ గా డిన్నర్, లంచ్ చేయడానికి అనువుగా ఉంటుంది.