షికాకాయలో మన జుట్టుకు మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ఈ షికాకాయి మన జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. దీనిలో ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు కూడా ఉంటాయి.
ఇవి నెత్తిమీద చనిపోయిన చర్మ కణాలను సులువుగా తొలగిస్తాయి. అంతేకాదు ఇవి జుట్టుకు మంచి తేమను అందించి జుట్టు పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది.
అంతేకాకుండా ఈ షికాకైలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి నెత్తిమీద ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.