
కిడ్నీల ఆరోగ్యం బాగున్నప్పుడే మనం అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే మన శరీరంలో ఉండే విషపదార్థాలను కిడ్నీలే బయటకు పంపిస్తాయి. దీనివల్లే మనం ఇంత అరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అయితే వీటి పనితీరుకు చిన్న ఆటంకం కలిగినా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి ఈ కిడ్నీలను కాపాడుకోవాలంటే నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి.
నీళ్లను తక్కువగా తాగేవారి కిడ్నీల్లోనే రాళ్లు ఏర్పడుతుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రాళ్లు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. యూరిక్ ఆమ్లాలు, లవణాలు, కాల్షియం, ఖనిజాల సమూహమే.. మూత్రపిండాల్లో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.
మూత్రపిండాల్లో రాళ్లు చిన్న సైజులో ఉంటే ఎలాంటి సమస్యలు రావు కానీ.. పెద్దగా ఉంటే మాత్రం విపరీతమైన నొప్పి కలుగుతుంది. మరి ఈ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకూడదంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి..
బీన్స్.. మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి బీన్స్ ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం 8 నుంచి 11 గంటల పాటు బీన్స్ ను నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని మంచిగా ఉడికించి తినాలి. వీటిలో ఉండే ఫైబర్ రాళ్లు కరిగేందుకు సహకరిస్తుంది. రోజుకు ఒకసారి తింటే ఈ సమస్య నుంచి చాలా తొందరగా బయటపడతారు.
తులసి ఆకులు.. తులసి ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇకపోతే కిడ్నీలో రాళ్లు కరగాలంటే కొన్ని తులసి ఆకులను బాగా ఎండబెట్టి పౌడర్ గా తయారుచేయండి. గ్లాస్ నీళ్లను తీసుకుని అందులో టీస్పూన్ తులసి ఆకుల పౌడర్ ను మిక్స్ చేసి టీని తయారు చేసుకుని తాగండి. ఈ టీని రోజుకు మూడుపూటలా తాగితే కిడ్నీలోని రాళ్లు ఇట్టే కరిగిపోతాయి.
నీళ్లను బాగా తాగండి.. నీళ్లను ఎంత ఎక్కువ తాగితే మన ఆరోగ్యం అంత సేఫ్ గా ఉంటుంది. అంతేకాదు కిడ్నీల్లో రాళ్లున్న వాళ్లు నీళ్లను ఎం ఎక్కువ తాగితే అంత మంచిది. నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల మలినాలు, ఖనిజాలను బయటకు పంపించడం మూత్రపిండాలకు చాలా సులువు అవుతుంది. కిడ్నీలకు హానీ కలిగించే వాటిని బయటకు పంపడానికి నీరు ఎంతో తోడ్పడుతుంది. అంతేకాదు నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలోని రాళ్లు మూత్రం గుండా బయటకు పంపబడతాయి. కాబట్టి రోజుకు 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నిమ్మరసం.. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం మిశ్రమం కిడ్నీలోని రాళ్లను కరిగించడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ మిశ్రమంలోని నిమ్మరసం.. రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ ముక్కలను బయటకు ఆలివ్ అయిల్ పంపిండానికి ఉపయోగపడుతుంది.