పెళ్లైన పురుషులు తప్పకుండా తినాల్సిన డ్రై ఫూట్ ఇది.. లేదంటే దీని బెనిఫిట్స్ ను మిస్ అయినట్టే..!

Published : Jun 04, 2022, 02:06 PM ISTUpdated : Jun 04, 2022, 02:08 PM IST

Benefits of Makhanas: డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన మఖానా (Makhana)పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచడంతో పాటుగా మరెన్నో లాభాలను చేకూరుస్తుంది. అవేంటంటే.. 

PREV
18
పెళ్లైన పురుషులు తప్పకుండా తినాల్సిన డ్రై ఫూట్ ఇది.. లేదంటే దీని బెనిఫిట్స్ ను మిస్ అయినట్టే..!

మఖానా (Makhana) ఎన్నో వ్యాధులను తగ్గించడంలో ఔషదంలా పనిచేస్తుంది. ముఖ్యంగా దీన్ని పురుషులు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈ డ్రై ఫ్రూట్ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ (Sperm count)ను పెంచడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అవేంటో ఇప్పుుడు తెలుసుకుందాం. 

28

ఎముకలు దృఢంగా ఉంటాయి.. మఖానాలో పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కార్బోహైడ్రెట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ ను పెంచడమే కాదు ఎముకలను కూడా బలంగా చేస్తుంది. అందుకే దీనిని పురుషులు ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

38

ఒత్తిడి తగ్గుతుంది.. మఖానా ఒత్తిడి (Stress) ని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తరచుగా తినడం వల్ల ఒత్తిడి సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఒత్తిడి వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుంది. అంతేకాదు భార్యా భర్తల మధ్య సంబంధాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందుకే వీటిని ఖచ్చితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వంధ్యత్వ సమస్యను కూడా తొలగిస్తుంది. 
 

48

కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది.. మఖానా కండరాలను నిర్మాణంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. వాస్తవానికి మఖానాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా తక్కువ మొత్తంలోనే ఉంటుంది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును ఏ మాత్రం పెంచదు. అంతేకాదు ఇది బరువును నియంత్రణలో ఉంచుతుంది. 

58

ఇది కండరాలను నిర్మించడంతో పాటుగా గుండెకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల గుండె (Heart)ను కూడా ఫిట్ గా ఉంటుంది. 

68

జ్వరం ఇతర సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ సలహా లేకుండా వీటిని ఆహారంలో చేర్చుకోకూడదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. 

78

మఖానాలు అధిక రక్తపోటు (High blood pressure)నియంత్రించడానికి కూడా ఎంతో సహాయపడతాయి. హై బీపీ పేషెంట్లు వీటిని ఉప్పుతో కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. 

88

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం పరిగడుపున వీటిని మూడు లేదా నాలుగు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

click me!

Recommended Stories