Jeera water: మధుమేహులకు జీరా వాటర్ ఓ వరం.. దీన్ని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Published : Jun 04, 2022, 01:02 PM IST

Benefits of Jeera water: డయాబెటీస్ పేషెంట్లకు జీలకర్ర నీళ్లు ఎంతో మేలు చేస్తాయి.. క్రమం తప్పకుండా ఈ నీళ్లను తాగడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.   

PREV
18
Jeera water: మధుమేహులకు జీరా వాటర్ ఓ వరం.. దీన్ని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

మధుమేహులకు జీలకర్ర నీళ్లు ఓ గొప్ప వరం లాంటివి. దీనిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar levels)అదుపులో ఉంటాయి. మధుమేహులకే కాదు స్థూలకాయులకు కూడా ఈ పానీయం ఎంతో సహాయపడుతుంది. ఇది బరువును కూడా తగ్గిస్తుంది. సాధారణంగా ఈ నీళ్లను ఉదయం పరిగడుపున తాగాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. దీనివల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి. 

28

జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. జీలకర్ర నీళ్లను ఉదయం తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి. అవేంటంటే..
 

38

అజీర్థి (Indigestion), వాపు, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి ఎన్నో సమస్యలకు ఇది చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంుది. వాస్తవానికి  జీరా వాటర్ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీంతో పేగుల సమస్యలు కూడా తొలగిపోతాయి. 

48

గర్భిణులకు కూడా జీరా వాటర్ ఎంతో మేలు చేస్తుంది. అయితే దీన్ని తీసుకునే ముందు ఒకసారి వైద్యుడి సలహాలను తీసుకోవడం మంచిది. 

58

జీలకర్ర నీళ్లు రోగ నిరోధక వ్యవస్థ (Immune system)ను బలోపేతం చేస్తుంది. జీలకర్రలో పుష్కలంగా ఉండే ఫైబర్ యే రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. 

68

జీరా వాటర్ మధుమేహులతో పాటుగా అధిక రక్తపోటు (High blood pressure) ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది హైబీపీని నియంత్రణలో ఉంచుతుంది. 

78

జీలకర్రలో కేలరీలు 7 మాత్రమే ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోలేరు. భోజనానికి ముందు ఈ నీళ్లను తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. 
 

88

జీరా వాటర్ లో దాల్చిన చెక్కను వేసి తీసుకుంటే కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నీళ్లు మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపడానికి ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం రాత్రంతా గ్లాస్ నీళ్లలో జీలకర్ర వేసి ఉదయం ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ను వేసి తాగాలి. 

click me!

Recommended Stories