ఉదయం లేవగానే పరిగడుపున గ్లాస్ వేడి నీళ్లు తాగితే ఏమోతుందో తెలుసా?

First Published | Nov 16, 2024, 1:35 PM IST

పరిగడుపున నీళ్లు తాగడం చాలా మంచిదని డాక్టర్లు చెప్తూనే ఉంటారు. చన్నీళ్లకు బదులుగా గోరువెచ్చని నీళ్లను తాగితే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే? 
 

Warm Water

నీళ్లు మన శరీరానికి చాలా అవసరం. నీళ్లతోనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే పరిగడుపున గోరువెచ్చని నీళ్లను తాగాని మన పెద్దలు చెప్తూనే ఉంటారు. ఆయుర్వేదం కూడా ఉదయాన్నే పరిగడుపున వేడి నీళ్లను తాగాలని చెప్తుంది.

ఎందుకంటే ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ వేడి నీళ్లు మనల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఉదయాన్నే వేడినీళ్లను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

warm water

జీవక్రియను పెంచుతుంది

ఉదయాన్నే పరిగడుపున వేడి నీళ్లను తాగడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో మీ జీవక్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ మెరుగ్గా ఉండటమంటే మన శరీరం తిన్న ఆహారాన్ని ఫాస్ట్ గా జీర్ణం చేసుకుంటుందన్న మాట. అంటే ఇది మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. 
 

Latest Videos


మలబద్ధకం తగ్గుతుంది

చాలా మంది మలబద్దకంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి వేడి నీళ్లు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదయాన్నే పరిగడుపున వేడి నీళ్లను తాగితే జీర్ణవ్యవస్థను సక్రియం అవుతుంది. దీంతో మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. వేడి నీళ్లు పేగు కదలికలను మెరుగుపర్చడానికి సహాయపడతాయి. 

విష పదార్థాలను తొలగిస్తుంది:

వేడి నీళ్లను తాగితే మీ శరీరంలో విష పదార్థాలు బయటకు పోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

వేడి నీళ్లను తాగితే మీరు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. వేడి నీళ్లను తాగితే మీ జీవక్రియ పెరుగుతుంది. ఇది మీ శరీరంలో పేరుకుపోయిన కేలరీలను బర్న్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు వేడి నీళ్లను తాగితే మీకు ఎక్కువ సేపు ఆకలి కాకుండా కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది మీరు తక్కువ తినేలా చేస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. 
 

చర్మానికి మేలు చేస్తుంది

గోరువెచ్చని నీళ్లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. గోరువెచ్చని వాటర్ ను తాగితే శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో చర్మానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల శరీరం నిర్విషీకరణ చెందుతుంది. ఇది శరీరంలో విషాన్ని తొలగిస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. 

గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో మీకు ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలు, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

Benefits of Warm Water


గొంతునొప్పి : వేడి నీళ్లు గొంతునొప్పిని తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయి. అంతేకాదు ఈ వాటర్ ఒంటి నొప్పులను తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా జలుబు ఉంటే. 

ఒత్తిడిని తగ్గిస్తుంది: గోరువెచ్చని నీళ్లను తాగితే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. అయితే నీళ్లను మరీ ఎక్కువ వేడి చేసి తాగకూడదు. దీనివల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీళ్లను మాత్రమే తాగండి. 
 

click me!