Coriander : ధనియాల గురించి ఈ విషయాలు తెలిస్తే వాటిని అస్సలు వదిలిపెట్టరు..

Published : Mar 27, 2022, 02:55 PM IST

Coriander : ధనియాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తగ్గడానికి కూడా ధనియాలు ఉపయోగపడతాయి. 

PREV
19
Coriander : ధనియాల గురించి ఈ విషయాలు తెలిస్తే వాటిని అస్సలు వదిలిపెట్టరు..

Coriander : ప్రతి వంటగదిలో ధనియాలు తప్పకుండా ఉంటాయి. సుగంధ ద్రవ్యాల్లో ఇవి కూడా ఒకటి. కానీ చాలా మంది వీటిని కేవలం వంటల్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఈ ధనియాల్లో ఎన్నో ఔషద గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

29

వంటలకు రుచిని ఇవ్వడమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పోషకాలు పుష్కలంగా ఉంటయి. ఇవన్నీమనం తిన్న ఆహారాన్ని తొందరగా అరగడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు కడుపు ఉబ్బరం, గ్యాస్, వంటి సమస్యలను తగ్గిస్తాయి. 
 

39

ధనియాలు జీర్ణక్రియ (Digestion) పనితీరును మెరుగుపరుస్తుంది. పీరియడ్స్ టైం లో అధిక రక్తస్రావం కాకుండా చూస్తుంది కూడా. నెలసరి సమయంలో ధనియాల నీళ్లను తాగితే హెవీ బ్లీడింగ్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. 

49

ధనియాల్లో ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలోని Hemoglobin levelsను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. 

59
coriander

అంతేకాదు నొప్పులను తగ్గించేందుకు వీటిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉపయోగపడతాయి. వాపు, దద్దుర్లు, దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం టీ స్పూన్ ధనియాల పొడిలో టీ స్పూన్ తేనె మిక్స్ చేసి స్కిన్ పై అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే ఈ  సమస్యలన్నీపోతాయి.

69
coriander

ఓవర్ వెయిట్ ను తగ్గించడానికి ధనియాలు ఎంతో సహాయపడతాయి.  ఇందుకోసం .. కొన్ని నీళ్లను  తీసుకుని అందులో టీ స్పూన్ ధనియాలను వేయాలి. మూడు గంటల తర్వాత గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించి దించుకోవాలి. ఈ నీళ్లను వడగట్టి రోజుకు రెండు పూటలా తాగాలి. 

79

మొలల సమస్యను తగ్గించడానికి కూడా ధనియాలు ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం కొత్తిమీర (ధనియాల మొక్క)శొంఠిని కొన్ని నీళ్లలో వేయాలి. దాన్ని బాగా ఉమరగబెట్టి వడగట్టుకుని తాగితే అర్శమొలల సమస్య తగ్గుతుంది. 

89

మధుమేహులు ధనియాలను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే ధనియాల కాషాయం లేదా టీని తయారుచేసుకుని తాగితే హార్మోన్లు సమస్యతుల్యంగా ఉంటాయి. 

99

కంటిచూపును మెరుగుపరచడానికి కూడా ధనియాలు ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం గ్లాస్ నీటిలో 20 గ్రాముల ధనియాల పౌడర్ ను వేసి బాగా ఉడకబెట్టాలి. బాగా ఉడికిన తర్వాత దాన్ని కిందికి దించుకుని వడకట్టి ఆ రసం చల్లారిన తర్వాత రెండు చుక్కల చొప్పున రెండు కళ్లలో వేయాలి. దీనివల్ల కళ్ల మంటలు, కళ్ల నుంచి నీళ్లు కారడం, కంటి కలక వంటి సమస్యలు తగ్గిపోతాయి.    

 

Read more Photos on
click me!

Recommended Stories