30 దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే ఏమౌతుంది?

First Published | Dec 26, 2024, 11:57 AM IST

దాదాపు అందరూ పాతికేళ్లు దాటగానే పెళ్లి పీటలు ఎక్కేస్తూ ఉంటారు. 30 దాటినా పెళ్లి చేసుకోకపోతే.. చుట్టుపక్కల వాళ్ల నుంచి, బంధువుల నుంచి మాటలు పడాల్సి వస్తుంది. మరి, 30 తర్వాత పెళ్లి లేకుండా సింగిల్ గా ఉండిపోతే ఏమౌతుంది..?

ప్రతి దేశంలో ప్రభుత్వం కనీస పెళ్లి వయసును నిర్ణయిస్తుంది. ఆ వయసు దాటిన తర్వాత వారు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో 30 తర్వాత పెళ్లి చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ.. ఇలా 30 దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటే ఏమౌతుందో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం..

30ఏళ్లు వచ్చేసరికి  స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ పరిణితి పెరుగుతుంది.ఈ వయసులో వారు ఒంటరిగా ఉండటం వల్ల జీవితంలో నష్టం సంగతి పక్కన పెడితే, వారి లైఫ్ ని ఎలా మార్చుకోవాలి అనే ఒక క్లారిటీ వారికి వస్తుంది. దానికి తగినట్లు ప్లాన్ చేసుకుంటారు. ఇరవైల్లో ప్రేమ లేదా పెళ్లి చేసుకుంటే కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ ముప్పైల్లో కుటుంబానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది.
 


ప్రేమ, పెళ్లి వంటి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ముప్పైలు అనువైన సమయం. ఇరవైల్లో ఈ విషయాల్లో చాలా గందరగోళం ఉంటుందని సంబంధ నిపుణులు చెబుతున్నారు. 30 తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. తమకు ఎవరు సరైనవారు అనే క్లారిటీ రావడంతో పాటు.. ఎలాంటి వారు జీవితంలోకి వచ్చినా.. సమస్యలు రాకుండా ముందుకు సాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

ఇరవైల్లో ఏ విషయానికైనా తొందరపడి భావోద్వేగానికి లోనై ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కానీ ముప్పైల్లో ప్రతి విషయంలోనూ ఓపికగా ఉండగలుగుతారు. ఎమోషనల్ అవ్వడానికి బదులు..ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
 

సంబంధాల్లో మరింత పరిణతి వస్తుంది కాబట్టి మొండితనం, వాదప్రతివాదాలు, స్వార్థం తగ్గుతాయి. దీనివల్ల సంబంధాలు మరింత గాఢమవుతాయి.  ముప్పైల్లో సింగిల్‌గా ఉన్నవారికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే సమయం, అవకాశం ఉంటుంది. ఇది వృత్తి, వ్యక్తిగత జీవితాలను చక్కదిద్దుతుంది. 

సింగిల్‌గా ఉన్నవారు కొత్త వ్యక్తులను కలవడానికి, కొత్త ప్రదేశాలు చూడటానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రపంచం గురించి అవగాహన పెరుగుతుంది.

ముప్పైల్లో ఒత్తిడి లేకుండా ప్రేమ కోసం వెతకవచ్చు. తనకు ఏమి కావాలో స్పష్టంగా తెలుస్తుంది. తనకోసం ఒకరిని కనుగొన్నప్పుడు నిష్కపటంగా, విశాల దృక్పథంతో వ్యవహరించడానికి ఈ అవగాహన ఉపయోగపడుతుంది.
 

Latest Videos

click me!