నడం చుట్టు కొవ్వు VS తొడల ప్రాంతంలో కొవ్వు : ఏది ఎక్కువ ప్రమాదకరం..??

First Published Aug 30, 2021, 1:53 PM IST

బెల్లీ ఫ్యాట్ కు, థై ఫ్యాట్ కు తేడా ఏంటీ అంటే.. బెల్లీ ఫ్యాట్ అనేది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తే... థై ఫ్యాట్ స్త్రీల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. 

‘ఏం తిన్నా.. అక్కడికే పోతుంది..’ ఇది నడుం చుట్టూ పేరుకుపోయే కొవ్వు విషయంలో అమ్మాయిల బాధ.. అయితే ఈ కొవ్వులు ఎలా ఏర్పడతాయి అంటే.. శరీరానికి అవసరానికి మించి తీసుకునే ఆహారం కొవ్వుగా మారి నడుంచుట్టూ, తొడల్లో పేరుకుపోతుంది. దీన్న బెల్లీ ఫ్యాట్ అని థై ఫ్యాట్ అని పిలుస్తారు. ఈ ఫ్యాట్ లను కరిగించడం కష్టంగా మారుతుంది. 

బెల్లీ ఫ్యాట్ అంటే ఏమిటంటే... నడుంచుట్టూ.. బొడ్డు ప్రాంతంలో...పొట్ట చుట్టూ పేరుకుపోయే ఎక్స్ ట్రా కొవ్వునే బెల్లీ ఫ్యాట్ అంటారు. ఇది మీకు తెలీకుండా మెల్లి మెల్లిగా చేరి చివరకు మీ రూపాన్ని మార్చేస్తుంది. 

బెల్లీ ఫ్యాట్ కు, థై ఫ్యాట్ కు తేడా ఏంటీ అంటే.. బెల్లీ ఫ్యాట్ అనేది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తే... థై ఫ్యాట్ స్త్రీల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. 

బెల్లీ ఫ్యాట్ కు, థై ఫ్యాట్ కు తేడా ఏంటీ అంటే.. బెల్లీ ఫ్యాట్ అనేది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తే... థై ఫ్యాట్ స్త్రీల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. 

నడుం చుట్టూ పేరుకుపోయే కొవ్వు ఎక్కువగా చెడ్డ కొవ్వు అయి ఉంటుంది. ఇది పొట్టలో ఉంటే అవయవాల చుట్టూ పేరుకుపోయి అనేక ఆరోగ్యప్రమాదాలకు దారి తీస్తుంది. 

విసరల్ ఫ్యాట్ వల్ల ఏర్పడే బెల్లీ ఫ్యాట్ చాలా ప్రమాదకరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్  ఉత్పత్తిని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల మధుమేహం బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని, గుండె జబ్బులు బారిన పడే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు. 

అయితే ఇదే తొడల దగ్గర పేరుకుపోయే కొవ్వుతో అంత ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీర మెటబాలిజంలో మార్పులతో వచ్చే వ్యాధులేనీ రావని అంటున్నారు. 

శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వుల్ని కరిగించడం అంత తేలికైన విషయం కాదు. ఇక బెల్లీఫ్యాట్, థై ఫ్యాట్ లలో పోలిస్తే.. బెల్లీఫ్యాట్ ను కరిగించడం చాలా కష్టమైన పని... 

మన శరీరంలోని కొవ్వులు రెండు రకాల కణాలతో ఏర్పడతాయి. అవే ఆల్ఫా కణాలు, బీటా కణాలు. అయితే ఆల్ఫా కణాలతో ఏర్పడే కొవ్వు ను కరిగించడం తేలికే. అదే బీటా కణాలతో ఏర్పడే కొవ్వును కరిగించాలంటే చాలా కష్టం. బెల్లీ ఫ్యాట్ బీటా కణాలతో ఏర్పడుతుంది. 

మరి ఎలా? దీన్నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఎలాంటి జీవనవిధానం అనుసరించాలి? అంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తినేప్పుడు మనసు పూర్తిగా ఆహారం మీదే లగ్నం చేయాలి.. అంతేకాదు నిరంతర వ్యాయామం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించొచ్చు. పేరుకుపోకుండా జాగ్రత్త పడొచ్చు. 

click me!