బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి తెగ తిప్పలు పడుతున్నారా? ఈ కూరగాయలను తినండి.. ఇట్టే తగ్గిపోతుంది

ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు కార్భోహైడ్రేట్లు, కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకూడదు. అంతేకాదు నూనెలో వేయించిన, ఫ్రూడ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవాలంటే కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

belly fat

నేటి తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో బెల్లీ ఫ్యాట్ ఒకటి. కడుపులోని వివిధ భాగాల్లో పేరుకుపోయే కొవ్వు చెడ్డది మాత్రమే కాదు ఆరోగ్యానికి ప్రమాదకరం కూడా. దీనివల్ల ఎక్కడలేని రోగాలు చుట్టుకుంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేయకపోవడం, లిమిట్ లేకుండా తినడమే ఇందుకు కారణం. నిజానికి బెల్లీ ఫ్యాట్ ను కరిగించడం అంత సులువు కాదు. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి సరైన ఆహారం, రోజువారీ వ్యాయామాలు చాలా అవసరం. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. కొన్ని కూరగాయలను తింటే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

బీట్ రూట్

బీట్రూట్ పోషకాల భాండాగారం. వీటిలో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ లో కేలరీలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలనుకునే వారు బీట్రూట్ ను తప్పకుండా తీసుకోవాలి. ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి , బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.
 


క్యారెట్లు

క్యారెట్లు కూడా బెల్లీ ఫ్యాట్ ను సులువుగా తగ్గించడానికి సహాయపడుతుంది. క్యారెట్లలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉండే క్యారెట్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటకు తీయడానికి, బరువును నియంత్రించడానికి క్యారెట్లను మీ రోజు వారి ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి. 
 

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే కాలీఫ్లవర్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ కాలీఫ్లవర్ మీ క్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

కీరదోసకాయ

కీరదోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలో నీటితో పాటుగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆకలి కోరికలను నియంత్రిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. అందుకే బెల్లీ ప్యాట్ ను తగ్గించుకోవాలనుకునే వారు కీరదోసకాయను జ్యూస్ ను తాగితే మంచి ఫలితం ఉంటుంది. 

పుట్టగొడుగులు

పుట్టగొడుగులు చాలా రకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన పుట్టగొడుగులను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. 100 గ్రాముల పుట్టగొడుగులలో మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల తినే ఆహారం మొత్తం చాలా వరకు తగ్గుతుంది. ఈ విధంగా ఈ పుట్టగొడుగులు మీరు బరువు తగ్గేందుకు సహాయపడతాయి.
 

బ్రోకలీ

100 గ్రాముల బ్రోకలీలో 34 క్యాలరీలు ఉంటాయి. బ్రోకలీలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా బెల్లీ ఫ్యాట్ ను, ఓవర్ వెయిట్ న తగ్గించడానికి సహాయపడుతుంది.
 

Latest Videos

click me!