Hair fall: రోజూ స్నానం చేస్తే నిజంగానే జుట్టు రాలిపోతుందా?

First Published | Nov 15, 2023, 11:32 AM IST

Hair fall: రోజూ తలస్నానం చేయకూడదు. తలస్నానం వారంలో రెండు మూడు సార్లు మాత్రమే చేయాలని చాలా మంది సలహానిస్తుంటారు. ఎందుకంటే ఇలా చేస్తే జుట్టు ఊడిపోతుందనేది. నిజానికి మనలో చాలా మందికి జుట్టు గురించి ఎన్నో విషయాలు తెలియవు. అందుకే దీనిపై ఎన్నో అపోహలను నమ్ముతాం. నిపుణుల ప్రకారం.. జుట్టు ఊడిపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకుందాం పందండి. 
 

hair fall

ప్రస్తుత కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారు. ఇది ప్రతిఒక్కరికీ ఉన్న సర్వసాధారణ సమస్య. ఏదేమైనా హెయిర్ ఫాల్ ఒత్తిడికి గురి చేస్తుంది. మనలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అందుకే జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలను చేస్తుంటాం. మార్కెట్ లోకి వచ్చిన ప్రతి ప్రొడక్ట్ ను ట్రై చేస్తుంటాం. అయినా జుట్టు రాలడం ఆగదే.. నిపుణుల ప్రకారం.. జుట్టుపై ప్రయోగాలు చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ జుట్టు మరింత ఊడేలా చేస్తుంది. మరి జుట్టు సంబంధించిన అపోహలేంటి? వాస్తవాలేంటో తెలుసుకుందాం పందండి. 

hair fall

జుట్టు ఎందుకు రాలుతుంది? 

వంశపారంపర్యంతో పాటుగా అనారోగ్య సమస్యలు, హార్మోన్ల మార్పులు లేదా వృద్ధాప్యం వల్ల కూడా జుట్టు రాలుతుంది. అలాగే ఫోలేట్, రిబోఫ్లేవిన్, బయోటిన్, విటమిన్ బి 12 లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. విటమిన్ బి 2 లోపం కూడా హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. 

Latest Videos


అపోహ 1:  తరచుగా షాంపూ పెడితే జుట్టు రాలుతుంది

వాస్తవం: తరచుగా షాంపూ పెట్టడం వల్ల రాలుతుందనే దానిలో నిజం లేదు. కానీ రెగ్యులర్ గా తలకు షాంపూ పెట్టడం వల్ల నెత్తిమీదున్న ఎసెన్షియల్ ఆయిల్ తొలగిపోయి జుట్టు రాలుతుందని మనం నమ్ముతాం. నిజానికి రెగ్యులర్ గా శుభ్రం చేయడం వల్ల నెత్తి ఆరోగ్యంగా ఉంటుంది. మురికి వల్ల నెత్తిమీద అదనపు నూనె, ఉత్పత్తులు పేరుకుపోతాయి. అందుకే వారానికి కనీసం రెండుసార్లు తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి. కండిషనర్ ను వాడితే కూడా ప్రయోజకరంగా ఉంటుంది. అంతేకానీ ప్రతిరోజూ షాంపూను పెట్టకండి. ఎందుకంటే ఇది నెత్తిమీదున్న ఎసెన్షియల్ ఆయిల్స్ ను తొలగించి జుట్టును జీవం లేనట్టుగా చేస్తుంది. ఎక్కువ గాడతున్న షాంపూను వాడితే జుట్టు మూలాలు దెబ్బతిని ఊడిపోయే అవకాశం ఉంది.
 

hair fall

అపోహ 2: క్యాప్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలుతుంది

వాస్తవం : క్యాప్ పెట్టుకోవడం వల్ల నేరుగా జుట్టేం రాలదు. ఎందుకంటే హెయిర్ ఫోలికల్స్ నెత్తిమీద లోతుగా అనుసంధానించబడి ఉంటాయి. టోపీ పెట్టుకోవడం వల్ల వాటి బలం ఏం తగ్గదు. కానీ స్కాల్ప్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు నెత్తిని శుభ్రంగా ఉంచుకోవాలి. సంక్రమణ వల్ల జుట్టు రాలే అవకాశం ఉంది. 
 

అపోహ 3: వృద్ధాప్యంలో జుట్టు రాలుతుంది

వాస్తవం: హెయిర్ ఫాల్ పర్టిక్యులర్ గా ఈ వయసు వారికే వస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. అంటే టీనేజర్లు కావొచ్చు, పెద్దలు కావొచ్చు. ఎవ్వరైనా హెయిర్ ఫాల్ సమస్యను ఫేస్ చేయొచ్చు. కాకపోతే వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలడం పెరుగుతుంది. ఎందుకంటే ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, జీవనశైలి మార్పులు  జీవితంలో ఏ దశలోనైనా జుట్టు రాలడానికి కారణమవుతాయి.
 

అపోహ 4: జుట్టు రాలడం శాశ్వతం
వాస్తవం: జుట్టు రాలడం శాశ్వతమని చాలా మంది నమ్ముతారు. జుట్టు సహజంగా రాలుతుంది. ఇది జుట్టు పెరుగుదల చక్రంలో ఒక భాగం. దీర్ఘకాలికంగా జుట్టు రాలడం వల్ల జుట్టు రాలితే జుట్టు పల్చబడుతుంది. అలోపేసియా వల్ల శాశ్వతంగా రాలుతుంది. కానీ చాలా మటుకు ఈ సమస్య కొద్ది కాలం వరకే ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి జీవనశైలి మార్పులు చేసుకోవాలి.
 

hair fall

అపోహ: జుట్టు రాలడానికి ఒత్తిడి ప్రధాన కారణం

వాస్తవం: జుట్టు రాలడానికి ఒత్తిడి కూడా కారణమే. కానీ ఇదొక్కటే జుట్టు రాలడానికి కారణం కాదు. ఒత్తిడి జుట్టు పెరుగుదల చక్రానికి ఆటంకం కలిగిస్తుంది. పోషక లోపాలు, కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా జుట్టు రాలుతుంది. కాకపోతే ఒత్తిడిని తగ్గించుకోవడం మొత్తం ఆరోగ్యానికి అవసరం. ఎందుకంటే ఇది జుట్టు రాలడానికే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. 

click me!