Beauty Tips: వర్షాకాలంలో మేకప్ తో బాధపడుతున్నారా.. అయితే ఇది మీకోసమే?

Published : Jun 26, 2023, 01:26 PM IST

Beauty Tips: చాలామంది ఆడవాళ్లు మేకప్ లేకుండా బయటకు వెళ్లడం లేదు. అలాంటి వాళ్ళకి వర్షాకాలం పెద్ద ఇబ్బందనే చెప్పాలి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో కూడా మేకప్ ని ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. ఇంతకు అవేంటో తెలుసుకుందాం.  

PREV
16
Beauty Tips: వర్షాకాలంలో మేకప్ తో బాధపడుతున్నారా.. అయితే ఇది మీకోసమే?

మేకప్ అనేది ఇప్పుడు ఆడవాళ్ళకి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఉద్యోగం చేసే ఆడవాళ్ళ నుంచి కాలేజీకి వెళ్లే టీనేజ్ పిల్లలు వరకు మేకప్ కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి వాళ్లకి వర్షాకాలం కాస్త ఇబ్బంది అనే చెప్పాలి.
 

26

ఈ సీజన్లో మేకప్ ని కాపాడుకోవడం అంతా సులువైన విషయం కాదు. అందుకే వర్షాకాలంలో కూడా మేకప్ ఎక్కువ సేపు నిలబడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వేసవికాలంలో మేకప్ ఎంత లైట్ గా వేసుకుంటే అంత మంచిది.
 

36

అది కూడా జెల్ లేదా నీటి ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల మేకప్ త్వరగా కరిగిపోకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే వర్షాకాలంలో మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి. మొఖం మీద మేకప్ ప్యాచ్ లాగా కాకుండా నీట్ గా రావాలంటే మేకప్ వేసుకోవడానికి ముందు ఐస్ ముక్కతో ముఖంపైన, మెడ పైన మర్దన చేయాలి.
 

46

ఇలా చేయటం వలన చికాకు, ఉక్కబోత కాస్త తగ్గి మేకప్ ఎక్కువ సేపు నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే లిప్స్టిక్ వాడేటట్లయితే నార్మల్ లిస్ట్ కాకుండా లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ ని వినియోగించడం వల్ల మీ పెదవులు అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
 

56

అంతేకాకుండా వర్షపు జల్లులో తడిచినా ఈ లిప్స్టిక్ పెద్దగా చెదిరిపోదు. అలాగే వర్షాకాలంలో ప్రైమరీ వాడటం కూడా చాలా మంచిది. ఈ ప్రైమరీ వల్ల ఫౌండేషన్ ఎక్కువసేపు ఉండటమే కాకుండా ఎక్కువ చెమట కూడా పట్టకుండా ఉంటుంది. ఇక మేకప్ లో ముఖ్యమైనది ఐ మేకప్.
 

66

వర్షాకాలంలో సాధారణంగా చమట పట్టడం సహజం. అందువల్ల కాజల్ ని పెన్సిల్ రూపంలో వాడాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో కూడా మేకప్ ని నీట్ గా మెయింటైన్ చేయవచ్చు.

click me!

Recommended Stories