పువ్వులు.. చర్మసౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాంటి సహజ అందాన్నిచ్చే పువ్వుల్లో మొదటి స్తానంలో ఉంటుంది మందార. దీంట్లోని అనేక ఔషధ సుగుణాలు మీ అందానికి మరింత మెరుగులు దిద్దుతాయి.
undefined
మందార టీ ని తాగడం వల్ల మరిన్ని ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. జుట్టుకు చక్కటి రిన్స్ గా, చర్మాన్ని తేమగా ఉంచడానికి తోడ్పుడుతుంది. ఈ టీ వల్ల శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే..
undefined
కొల్లాజెన్ ఉత్పత్తి : మందార టీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. మందార టీ శరీరంలో కొల్లాజెన్ పెరుగుదలకు తోడ్పడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచడానికి అవసరమైన పదార్థం కొల్లాజెన్. ఇది చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా,ఎక్కువసేపు మెరుస్తూ ఉండేలా చే స్తుంది.
undefined
చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది : మందార టీ శరీరంలోని విషపదార్థాలను తొలగించి, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి దోహదపడుతుంది. ఈ లక్షణాల కారణంగా, చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడంతో పాటు.. చర్మానికి రక్త సరఫరాను పెంచుతుంది.
undefined
చర్మపు మంటను తగ్గిస్తుంది : విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఈ టీలో ఎక్కువగా ఉన్నందున... చర్మం ఎర్రబడడం, దురదలు రావడం లాంటివి తగ్గించడానికి సాయపడుతుంది.
undefined
అంతేకాదు చర్మం మీద ఉండే ముదురు మచ్చలు, చర్మం సాగిపోవడం లాంటివి జరగకుండామందార టీ సహాయపడుతుంది. చర్మంపై కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
undefined
జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుంది : మందార టీ మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే, ఇది జుట్టు పెరుగుదలకు ముఖ్యమైన పోషకాలైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. అందువల్ల, మందార టీ తాగడం వల్ల మీ జుట్టు ఒత్తుగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు కుదుళ్లను బలంగా తయారుచేస్తుంది.
undefined
అందమైన, ఆరోగ్యకరమైన జుట్టుకు : మందార టీతో జుట్టును క్లెన్సింగ్ చేస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టును స్మూత్ గా చేస్తుంది. చుండ్రును తొలగిస్తుంది. కండీషనర్ గా వాడడం వల్ల.. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో దోహదపడుతుంది.
undefined