వధువు మీద ఉమ్మడం, వరుడి కాళ్లు కట్టేసి కొట్టడం.. వింత పెళ్లిళ్లు, విచిత్ర సంప్రదాయాలు... ఎక్కడంటే..

First Published Oct 2, 2021, 2:23 PM IST

దక్షిణ కొరియా, జర్మనీ, కెన్యా, స్కాట్లాండ్, ఫ్రాన్స్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలలో పెళ్లిలో జరిగే వింతల గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న అలాంటి విచిత్ర మైన వివాహా సంప్రదాయాల గురించి చూడండి. 

ఎన్నో వింతలు, విచిత్రాల సమాహారం ఈ ప్రపంచం. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక విచిత్రమైన సంప్రదాయాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయానికి వచ్చేసరికి.. ఇలాంటి చిత్ర విచిత్ర సంప్రదాయాలకు కొదవే లేదు. మన దేశంలో చెట్టును పెళ్లిచేసుకోవడం, కుక్కకు తాలికట్టడం లాంటి విచిత్రాల గురించి మనకు తెలుసు. 

ఇదే విచిత్రం అనుకుంటే దక్షిణ కొరియా, జర్మనీ, కెన్యా, స్కాట్లాండ్, ఫ్రాన్స్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలలో పెళ్లిలో జరిగే వింతల గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న అలాంటి విచిత్ర మైన వివాహా సంప్రదాయాల గురించి చూడండి. 

శరీరం, ముఖాన్ని నల్లగా మార్చడం.. : మనదేశంలో వివాహం అంటే మంగళ స్నానం పేరుతో పసుపు నీటితో స్నానం చేయిస్తారు. దీనికి భిన్నంగా స్కాట్లాండ్‌లో వధూవరుల స్నేహితులు కాబోయే జంటను ట్రెకిల్, మసి, ఈకలు, పిండితో నల్లగా మార్చేసే సంప్రదాయం ఉంది. ఇలా నల్లగా చేసిన తరువాత వారిద్దరినీ వీధుల్లో ఊరేగిస్తారు. దీనివల్ల వధూవరులకు ఎలాంటి దుష్టశక్తులూ ఆవహించకుండా పారద్రోలుతారట. 

weddin

కూతురు మీద ఉమ్మడం : వినడానికే ఇబ్బందిగా ఉంది కదా. దారుణంగా అనిపిస్తుంది కదా. అయితే ఈ సంప్రదాయమూ ఉంది. అదీ కెన్యాలో.  మసాయి తెగలో కూతురికి వివాహం చేసి అత్తవారింటికి పంపేముందు వధువు తండ్రి తన కుమార్తె తల, ఛాతీపై ఉమ్మివేస్తాడు. ఇలా చేయడం వల్ల కూతురిని అదృష్టం వరిస్తుందని, అదృష్టానికి చిహ్నంగా ఈ సంప్రదాయాన్ని చెబుతారు. 

స్మాషింగ్ క్రాకరీ : ఒక్క పింగాణీ పాత్ర పగిలితేనే ప్రాణం ఉసూరుమంటుంది. అలాంటిది అందరూ కలిసి ఇంట్లో ఉన్న మనకిష్టమైన పింగాణీ సామానంతా పగలగొడితే... బాబోయ్ అంటారా? అయితే జర్మనీలో మాత్రం ఇదొక శుభాన్ని కలిగించే చర్య. కొత్తగా పెళ్లైన జంట ఇంటికి వచ్చిన అతిధులు వారిని ఆశీర్వదించి పింగాణీ పాత్రల్ని పగలగొడతారు. దీనివల్ల వధూవరులను అదృష్టం వరిస్తుందట. ఈ సంప్రదాయాన్ని పోల్టెరాబెండ్ అంటారు. ఇక ఇలా పగిలిన పింగాణీ పాత్రలన్నింటినీ వధూవరులిద్దరూ కలిసిశుభ్రపరుస్తారు. అంటే దీనివల్ల వారిద్దరూ కలిసి మెలిసి పనులు చేసుకుంటారని, జీవితానికి భాగస్వాములుగా అన్ని సవాళ్లను ఎదుర్కొంటారని అర్థమట.

Beating the groom’s feet

వరుడి కాళ్ల మీద కొట్టడం : ఇదెక్కడి విచిత్రమైన సంప్రదాయంరా బాబు.. పెళ్లి లేకపోయినా సరే.. కొట్టడం ఏంటీ.. అనుకుంటున్నారా? కానీ ఇది దక్షిణ కొరియాలో తప్పనిసరిగా వివాహవేడుకలో కనిపించే సంప్రదాయం. వరుడు తన నూతన వధువును ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే ఈ దెబ్బలు భరించాల్సిందే. ఇందులో భాగంగా వరుడు లేదా స్నేహితుల కుటుంబం, వరుడి బూట్లు తీసి అతని చీలమండలను తాడుతో కట్టాలి. ఆ తరువాత ఆడపెళ్లి వారు కర్ర లేదా ఎండిన చేపతో అతని పాదాల మీద కొట్టాలి. ఈ శిక్ష వినోదభరితంగా పరిగణించబడుతుంది. అలాగని రక్తాలు కారాల్సిన పని లేదు. ఈ సంప్రదాయం ప్రాథమికంగా మనిషి శక్తిని, సహనాన్ని పరీక్షించడం కోసం చేస్తారు. 

మిగిలిపోయిన ఆహారాన్ని తినిపించడం : ఫ్రెంచ్ సంప్రదాయాల ప్రకారం, నూతన వధూవరులకు మిగిలిపోయిన ఆహారం, జ్యూస్ లను ఒక చాంబర్ పాట్‌లో వేసి ఇంటికి వచ్చిన అతిథులతో వడ్డించేలా చేస్తారు. ఇది కొత్తగా పెళ్లైన జంటకు శోభనం రాత్రి నాడు శక్తిని ఇస్తుందని నమ్ముతారు. కానీ దీన్ని ఇప్పుడు కాస్త మార్చారు. వారికి ఇప్పుడు చాక్లెట్, షాంపైన్ మిశ్రమం ఇస్తున్నారు.

నో బాత్రూమ్ : మూడు రోజుల వరకు బాత్రూమ్ కు వెళ్లొద్దు. మీరు విన్నది నిజమే. మలేషియా,  ఇండోనేషియాలో, బోర్నియోలోని టిడాంగ్ ప్రజలు దంపతులను వరుసగా మూడు రోజుల వరకు బాత్రూమ్ కు వెళ్లొద్దు. వారిని పెళ్లి తరువాత ఇంట్లో ఫ్రీగా తిరగనివ్వరు. వారి మీద నిఘా పెడతారు. దీనికోసం ఒక గార్డును నియమిస్తారు. ఈ మూడు రోజుల పాటు కొద్దిగా ఆహారం, నీళ్లు మాత్రం ఇస్తారు.  ఇలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని,  విడాకులు కావని, వారి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. 

click me!