bathukamma 2023: నేడే సద్దుల బతుకమ్మ.. ఈ రోజుకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

R Shivallela | Published : Oct 22, 2023 1:21 PM
Google News Follow Us

bathukamma 2023: ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సద్దుల బతుకమ్మ రానే వచ్చింది. ఈ రోజు ఆడపచులంతా తీరొక్క పువ్వులతో బతుకమ్మను ఎంతో అందంగా, అపురూపంగా పేరుస్తారు. ఇక సాయంత్రం వేళ అయితే తెలంగాణలోని ప్రతి చెరువు పువ్వుల వనంలాగే మారిపోతుంది. 
 

15
bathukamma 2023: నేడే సద్దుల బతుకమ్మ.. ఈ రోజుకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
Bathukamma 2023

భారతదేశంలో కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణాలో జరుపుకునే అత్యంత అందమైన, రంగురంగుల పండుగల్లో ఇదీ ఒకటి. ముఖ్యంగా ఈ పూల పండుగ ఆడపడుచులకు ఎంతో సంబురాన్ని మోసుకొస్తుంది. అందుకే ఎక్కడున్న పువ్వునైనా తీసుకొచ్చి అందమైన బతుకమ్మను పేరుస్తారు. 

25
Bathukamma 2023

ఈ పూల పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపులో ఒక అంతర్భాగమైపోయింది. ఈ పండుగను కేవలం స్థానికంగా లభించే పూలతోనే తయారుచేస్తాయి. ప్రతి ఏడాది ఈ పండుగను వర్షాకాలం చివరన, చలికాలం ప్రారంభానికి ముందు జరుపుకుంటారు. ఇప్పటికే పడ్డ వానలతో చెరువులు, కుంటలన్నీ నిండుకుండలా మారిపోయాయి. దీంతో  రకరకాల పువ్వులు పూస్తాయి. తంగేడు, గునుకు, నందివర్దనం, తామర పువ్వులు, చామంతి, బంతి మొదలైన పువ్వులను ఈ సీజన్ లో వికసిస్తాయి. 

35

సద్దుల బతుకమ్మను దసర పండుగకు రెండు రోజుల మందే జరుపుకుంటారు. ఇప్పటికే మనం ఎనిమిది రోజుల బతుకమ్మ పండుగను జరుపుకున్నాం.. ఎంగిలి బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానెబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్ద బతుకమ్మను ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఇక ఈ రోజు పూల పండుగలో తొమ్మిదో రోజు. అంటే ఈ రోజే సద్దుల బతుకమ్మ. దీనినే దుర్గాష్టమి అని కూడా అంటారు. 

Related Articles

45

ఈ సద్దుల బతుకమ్మ నాడు ఎన్నో రకాల పువ్వులతో బతుకమ్మను వీలైనంత పెద్దగా పేరుస్తారు. తీరొక్క పువ్వులతో ఆడపిల్లను తయారుచేసినట్టే తయారుచేసి ఆడపడుచులు ఎంతో మురిసిపోతారు. అంతేకాదు పెద్ద బతుకమ్మ పక్కన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పూజిస్తారు. అయితే సద్దుల బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత గౌరమ్మగా భావించే పసుపు ముద్దను ఆడవారు తమ చెంపలకు రాసుకుంటారు. లేదా తాళిబొట్టుకు పెడతారు. 

55

అయితే తొమ్మిదో రోజు బతుకమ్మకు సద్దుల బతుకమ్మ అని పేరు రావడానికి ఒక కథ కూడా ఉంది. ఈ రోజు అమ్మవారు రాక్షసుడిని చంపి బాగా అలసిపోతుంది. దీంతో అమ్మవారికి సద్దుల పేరుతో రకరకాల నైవేద్యాలు చేసి పెడతారు. సద్దుల బతుకమ్మ నాడు కొబ్బరి సద్ది, నువ్వుల సద్ది, పెరుగన్నం, పులిహోర, చిత్రాన్నం వంటి ఎన్నో రకాల నైవేద్యాలను తయారుచేస్తారు. అందుకే బతుకమ్మ చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. బతుకమ్మ మొదటి రోజు నుంచి ఎనిమిదో రోజువరకు బతుకమ్మ సంబురాలు అంతంత మాత్రమే ఉంటాయి. కానీ సద్దుల బతుకమ్మ నాడు ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. ఈ రోజు ఆడపడుచులూ ఏ పనులకూ వెళ్లరు. రకరకాల పువ్వులతో తాంబాలంలో అందమైన బతుకమ్మను తయారుచేసి సాయంత్రం వేళ బతుకమ్మ పాటలతో ఆడి పాడుతారు. 
 

Recommended Photos