1.చైల్డ్ పోస్..
దాదాపు అందరూ ఆఫీసుల్లో చైర్లలో కూర్చొని వర్క్ చేస్తున్నవారే. అలా వర్క్ చేయడం వల్ల వెన్ను నొప్పి రావడం చాలా సహజం. ఆ నొప్పిని తట్టుకోవడానికి.. ఈ చైల్డ్ పోస్ ఉపయోగపడుతుంది.
ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఈ విషయం తెలుస్తుంది. చిన్న పిల్లలు నెలల వయసులో ఉన్నప్పుడు ఇలానే పడుకుంటారు. ఈ చైల్డ్ పోస్ లో మూడు నుంచి 5 నిమిషాల పాటు ఉండాలి. ఈ యోగాసనం వేయడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది.