No Smoking: సిగరేట్ మానుకోలేదో.. మీరు గుడ్డివాళ్లవడం ఖాయం..

Published : Apr 14, 2022, 01:55 PM IST

No Smoking: సిగరేట్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.  స్మోకింగ్ చేయడం వల్ల  ఊపిరితిత్తులు, గుండెకు హానీ జరగడమే కాదు.. కంటి ఆరోగ్యానికి కూడా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
17
No Smoking: సిగరేట్ మానుకోలేదో.. మీరు గుడ్డివాళ్లవడం ఖాయం..
smoking

No Smoking: సిగరేట్ తాగడం వల్ల నష్టాలే తప్ప లాభం ఒక్కటి కూడా లేదు. కిక్కు వస్తుందని సిగరేట్లను కాల్చితే మాత్రం శరీరంలో ఉండే ఎన్నో అవయవాలు కరాబవుతాయి. ముఖ్యంగా ధూమపానం వల్ల మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి వస్తాయి. ఈ విషయం అందరికే తెలిసిందే. ఈ ప్రమాదాల బారి నుంచి బయటపడేందు టీవీల్లోనూ, సినిమా థియేటర్లలోనూ, ఆఖరికి సిగరేట్ ప్యాకెట్ పైన కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని. కానీ చాలా మంది ఈ మాటలను అస్సలు పట్టించుకోకుండా.. సిగరేట్ల మీద సిగరేట్లు కాల్చుతుంటారు. 
 

27

అయితే తాజా పరిశోధనల ద్వారా స్మోకింగ్ వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం అయ్యింది. స్మోకింగ్ చేసేవారిలో ఈక్రింది లక్షణాలు కనిపిస్తే సిగరేట్ ను మానేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. 

37

కళ్లు మసక బారడం.. స్మోకింగ్ చేస్తే కళ్లకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీంతో కంటి చూపు సరిగ్గా ఉండదు. కళ్లు మసక బారుతాయి. అలాగే కంటిలో మంట పుడుతుంది. ఇలా కాకూడదంటే స్మోకింగ్ చేయడం పూర్తిగా మానుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా కంటి వ్యాయామాలను పాటించాలి. 

47

కళ్లు పొడిబారడం.. స్మోకింగ్ చేయడం వల్ల కళ్లపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా స్మోకింగ్ చేస్తే కళ్లు డ్రైగా అయిపోతాయి. కళ్లు డీహైడ్రేషన్ సమస్య బారిన పడతాయి. ఇలాంటి వారికి లాప్ టాప్ లేదా కంప్యూటర్ స్క్రీన్ సరిగ్గా కనబడదు. ఈ సమస్య ఉన్న వారు ఇరవై నిమిషాలకోసారి కళ్లకు రెస్ట్ ఇవ్వాలి. స్క్రీన్ ను చూడటం వీలైనంతగా తగ్గించాలి. కళ్లు డ్రై గా మారినప్పుడు ఐడ్రాప్స్ వేసుకోవాలి. సమస్య తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు. 
 

57

కంటి శుక్లాలు.. సిగరేట్ తాగినప్పుడు ఆ పొగ కంటిని తాకే అవకాశం ఉంది. పొగ కంటిని తాకితే కంటి శుక్లాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య బారిన పడితే చూపు దెబ్బతింటుంది. ఈ సమస్య కేవలం ఆపరేషన్ చేస్తేనే తగ్గుతుంది. కాబట్టి సిగరేట్ ను మానేయడం ఉత్తమం. 

67

అలాగే లైట్ల వెలుతురు చూస్తున్నప్పుడు అవి మరింత ప్రకాశవంతంగా కనిపించడం, మసకబారినట్టు అనిపించడం, వెలుతురులో వస్తువులను చూడలేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తే .. మీరు వెంటనే సిగరేట్ ను మానేయాలని అర్థం. 
 

77

కళ్లను కాపాడుకోండిలా.. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే స్మోకింగ్ మానేయడంతో పాటుగా మరికొన్ని అలవాట్లును కూడా అలవర్చుకోవాలి. ముఖ్యంగా కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం మానుకోవాలి. ప్రతిరోజూ కళ్లకు సంబంధించిన వ్యాయామాలను చేయాలి. ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలను, ఇతర ఆహారాలను  తీసుకోవాలి. కళ్లను చేతులతో రుద్దకూడదు. 


  
 

click me!

Recommended Stories