శృంగారం సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా.. అయితే ఇలా ట్రై చేసి చూడండి..

First Published | Apr 14, 2022, 12:33 PM IST

మామూలుగా అయినా శృంగారంలో అయినా ప్రతీసారి అదే ఉత్సాహంతో ఉంటారని లేదు. కొన్నిసార్లు చాలా లోగా అనిపిస్తుంది. శరీరం అన్నిసార్లూ మీకు నచ్చినట్టుగా ఉన్నట్లు అనిపించదు. రకరకాల అనుమానాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమయంలో శృంగారం అంటే కాస్త అసౌకర్యంగా ఫీలవుతారు. 

మీ శరీరం మీద మీకున్న కాన్ఫిడెన్స్ శృంగారాన్ని మరింత అద్భుతంగా మార్చేస్తుంది. అయితే అన్నిసార్లు అదే కాన్ఫిడెన్స్ ఉండదు. మీలోని ఏదో లోపం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. దీంతో మీ స్వంత శరీరమే మీకు అసౌకర్యంగా, నిరాశగా అనిపిస్తుంది. ముఖ్యంగా లైంగిక చర్య సమయంలో ఇది బాగా వ్యక్తమవుతూ ఉంటుంది. తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి తమ భాగస్వామి ముందు తమను తాము పూర్తిగా భరించవలసి ఉంటుంది. దీన్నుండి బయటపడాలంటే సెక్స్ సమయంలో ఆత్మవిశ్వాసం, మీ శరీరం మీకు సానుకూలంగా ఉండాలంటే ఇలా చేయాలి. 

sex addiction

అద్దంలో చూసుకోండి...
అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవడం ప్రారంభించండి, దీనివల్ల మీ శరీరంతో మీరు ప్రేమలో పడతారు. మీలోని భాగాలేని అంశాలు కూడా మీకు ఇబ్బందిగా అనిపించవు. మీరు మీ శరీరానికి ఎంత ట్యూన్‌లో ఉంటే, మీ భాగస్వామి ముందు మిమ్మల్ని మీరు అంతగా వ్యక్తీకరించగలుగుతారు.


మీకు నచ్చినవే... 
శృంగారంలో తొందరపడకండి. మీరు మీ భాగస్వామితో ఉండే ప్రతిక్షణాన్ని ఆనందించండి.  ఫోర్‌ప్లేతో ప్రారంభిస్తే, అందులో మీకు ఇష్టమైనవాటిని.. ఎలా అయితే మీరు ప్రేరేపితం అవుతారో అది గుర్తించి.. అలా ప్రయత్నించండి. ఉదాహరణకు మీరు ఓరల్ సెక్స్‌తో మొదలుపెడితే.. అలా చేయడం మీకు ఇష్టమేనా, కాదా.. అర్థం చేసుకోండి.. సెక్స్ విషయంలో మీ ప్రాధాన్యతలను మీరు గ్రహించినప్పుడు, మీరు మరింత ఆత్మవిశ్వాసం పొందుతారు.

భాగస్వామితో మాట్లాడాలి...
శృంగారం అంటే ఇద్దరు వ్యక్తులు ఎవరికి నచ్చినట్టు వారు చేసుకుంటూ పోవడం కాదు. ఒకరికి నచ్చినట్టు ఒకరు కంఫర్ట్ ను ఇవ్వడం. అందుకే మీ భాగస్వామితో మాట్లాడండి.. శృంగారంలో మీకు ఏమేమి ఇష్టమో చెప్పండి. నచ్చని వాటి గురించి తెలియజేయండి. మంచం మీద మీ ఆలోచనలను, భావాలను వ్యక్తీకరించకుండా ఎంత అణచివేస్తే, మీ ఇద్దరి మధ్య అంతరం అంతపెరుగుతుంది.

మూడ్ లోకి రండి.. 
మిమ్మల్ని సెక్సీ మూడ్‌లోకి తీసుకువచ్చేది ఏంటో తెలుసుకోవడానికి, మీరు ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేనికి మీరు ట్యూన్ అవుతారు.. దేనివల్ల మీరు మూడ్ లోకి వస్తారు.. అర్థం చేసుకోవాలి. నెమ్మదిగా సంగీతం వినడం లేదా వైన్ తాగడం వల్ల మీరు మంచి మూడ్ లోకి వచ్చినట్లైతే.. వాటిని కంటిన్యూ చేయండి. 

Latest Videos

click me!