back pain: నడుం నొప్పిని సులువుగా తగ్గించే చిట్కాలివిగో..

Published : Apr 14, 2022, 12:50 PM IST

back pain: మన ఆహారపు అలవాట్లు, కూర్చునే పద్దతి , మారిన జీవనశైలి కారణంగా నడుం నొప్పి వస్తుంటుంది. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటంటే..   

PREV
18
back pain: నడుం నొప్పిని సులువుగా తగ్గించే చిట్కాలివిగో..

back pain: టెక్నాలజీ మహత్యమా అని మనుషుల పని ఎంతో తగ్గింది. ఇది మంచిగనే ఉన్నా.. ఈ మారుతున్న జీవనశైలి కారణంగా ఎన్నో రోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో వెన్నునొప్పితో బాధపడేవారి సంఖ్య విపరీతంగా  పెరిగిపోయింది. నివేధికల ప్రకారం.. ప్రతి నలుగురిలో ఇద్దరు నడుం నొప్పితో ఇబ్బందిపడుతున్నారట. 

28
back pain

ఈ నొప్పికి ఈ వయసు వారు ఆ వయసు వారంటూ భేధాలేమీ లేవు. అయితే ఈ నొప్పి తక్కువగా ఉన్నప్పుడే కొన్నిఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ఈ చిన్న చిన్న సమస్యలకు కూడా మందు బిల్లలు మింగితే మన ఆరోగ్యనికి ఏ మాత్రం మంచిది కాదు . కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నడుం నొప్పి తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

38

వెల్లుల్లి.. ఈ వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇదే నడుం నొప్పిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని పెయిన్ కిల్లర్ అనే అనొచ్చు. నడుం నొప్పి తగ్గాలంటే పరిగడుపున రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తినాలి. రెగ్యులర్ గా ఇలా తింటే నడుం నొప్పి కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది. 
 

48

అల్లం.. అల్లం ఎన్నో అనారోగ్య సమస్యలకు బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తుంది. అంతేకాదు ఇది నడుం నొప్పిని కూడా తగ్గించగలదు. అందుకే మీరు తినే ఆహారాల్లో అల్లం ఉండేట్టు చూసుకోవాలి. అల్లం టీ తాగినా ఈ నొప్పినుంచి ఉపశమనం పొందవచ్చు. 

58

కొబ్బరి నూనె.. కొబ్బరి నూనెలో యాంటీ పైరేటిక్, యాంటి ఇన్ ఫ్లమేటరీ, అనార్జిసిక్ గుణాలు ఉంటాయి. ఇవి ఎన్నో నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. తీవ్రమైన నడుం నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెతో మర్ధన చేస్తే.. తక్షణమే ఈ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజుకు మూడు సార్లు కొబ్బరి నూనెతో మర్దన చేస్తే దీని నుంచి తొందరగా బయటపడొచ్చు. 
 

68

పసుపు పాలు.. పాలల్లో చిటికెడు పసుపు కలుకుని తాగితే మన ఆరోగ్యానికి ఏ ప్రమాదం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపు కలిపిన పాలను తాగితే నడుం నొప్పి తగ్గిపోతుందట. ఈ పాలల్లో కుర్ క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇదే నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇకపోతే పాలలో ఉంటే విటమిన్ డి, కాల్షియం బోన్స్ ను బలంగా ఉంచుతుంది. రాత్రి పూట పసుపు పాలను తాగితే హాయిగా నిద్రపట్టడమే కాదు ఎన్నోరోగాలు దూరమవుతాయి. 

78
olive oil

ఆలివ్ ఆయిల్.. ముడి ఆలివ్ ఆయిల్ లో ఓలియోకాంతల్ అనే పదార్థం ఉంటుంది. ఇది నడుం నొప్పిని తగ్గించడానికి ఎంతో  సహాయపడుతుంది. ఈ ఆయిల్ ను తీసుకుని నొప్పిగా ఉన్నచోట అప్లై చేసి 15 నిమిసాల పాటు మసాజ్ చేస్తే నొప్పి మెల్లి మెల్లిగా తగ్గిపోతుంది. 

88


యోగా.. యోగాతో ఆరోగ్యమే కాదు ఫిట్ గా కూడా ఉంటారు. అలాగే యోగాతో నడుం నొప్పికి చెక్ పెట్టొచ్చు. కొన్ని నడుం నొప్పిని తగ్గించే యోగా భంగిమలు చేస్తేచాలు దీనినుంచి సులువుగా బయటపడతారు. కానీ వీటిని ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు. 

click me!

Recommended Stories