Birth Date Career మీ పుట్టిన తేదీ.. మీరే కెరీర్ ఎంచుకోవాలో చెబుతుంది!

Published : Mar 20, 2025, 08:17 AM IST

వాస్తు శాస్త్రం ప్రకారం కెరీర్ (Career), పుట్టిన తేదీ (DOB)లకు విడదీయరాని బంధం ఉంటుంది. మీరు పుట్టిన తేదీ ప్రకారం ఎలాంటి కెరీర్ ఎంచుకుంటే రాణిస్తారో తెలుసుకోవాలనుందా? అయితే పదండి. 

PREV
15
 Birth Date Career మీ పుట్టిన తేదీ.. మీరే కెరీర్ ఎంచుకోవాలో చెబుతుంది!
ఎవరికి ఏ ఉద్యోగం?

పుట్టిన తేదీ ప్రకారం కొందరికి కొన్ని రకాల ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉదాహరణకు 9, 18 లేదా 27 తేదీల్లో పుట్టిన వారు క్రీడా రంగాన్ని ఎంచుకుంటారు. నెలలో 1, 10, 19 లేదా 28 తేదీల్లో పుట్టిన వారు మేనేజ్‌మెంట్ కేటగిరీలోని వృత్తులను ఎంచుకుంటారు. చిన్న లేదా పెద్ద కార్పొరేట్ సంస్థలకు అధిపతులుగా ఉంటారు.

25

2, 11, 20 లేదా 29 తేదీల్లో పుట్టిన వారు సృజనాత్మక లేదా దౌత్యపరమైన పనుల్లో ఉంటారు. వీళ్లు పెయింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, నటన వంటి వృత్తుల్లో రాణిస్తారు. నెలలో 3, 12, 23 లేదా 30 తేదీల్లో పుట్టిన వారు బ్యాంక్, మీడియా, రిటైల్ రంగాల్లో పనిచేయడానికి ఇష్టపడతారు. లేదా ఆ సంస్థల్లో ఉద్యోగం చేస్తారు.

35

నెలలో 4, 13, 22 లేదా 31 తేదీల్లో పుట్టిన వారు... వ్యాపారం చేస్తే స్పెక్యులేషన్ లేదా బీమా సంబంధిత పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా వీరికి కలిసి వస్తుంది. ఉద్యోగం చేస్తే దాదాపు అన్ని రకాల ఉద్యోగాలు చేస్తారు. చాలా సందర్భాల్లో కంప్యూటర్ లేదా నెట్‌వర్కింగ్ సంబంధిత పనులు చేస్తారు.

45

నెలలో 5, 14 లేదా 23 తేదీల్లో పుట్టిన వారు... సేల్స్, మార్కెటింగ్, బీమా, పుస్తకాల అమ్మకం లేదా రిటైల్ వ్యాపారంలో ఉంటారు. 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన వారు హోటల్ లేదా రెస్టారెంట్ వ్యాపారం చేస్తారు. నెలలో 7, 16 లేదా 25 తేదీల్లో పుట్టిన వారు... రీసెర్చ్ సంబంధిత పనులు ఎంచుకుంటారు. విద్యా సంబంధిత పనుల్లో ఉండటానికి ఇష్టపడతారు.

55

నెలలో 8, 17 లేదా 26 తేదీల్లో పుట్టిన వారు... వీరు సాధారణంగా జీవితంలో మొదట్లో ఉద్యోగం లేదా వ్యాపారం చేసినా అంతగా రాణించలేరు. మధ్య వయస్సు తర్వాత విజయం సాధిస్తారు. స్థలం-భూమి సంబంధిత ఉద్యోగం లేదా వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం సివిల్ ఇంజనీరింగ్ సంబంధిత ఉద్యోగం లేదా వ్యాపారం, ఖనిజాల వ్యాపారం, వ్యవసాయం సంబంధిత పనులు చేస్తారు.

Disclaimer: ఎవరి కెరీర్‌ను వారే ఎంచుకోవాలి. ఇక్కడ కొన్ని అంచనాలు మాత్రమే చెబుతారు.

click me!

Recommended Stories